అభిషేక్‌కు స్పెషల్ బర్త్‌డే పార్టీ ఇచ్చిన ఐశ్వర్య

హైదరాబాద్: సెకండ్ ఇన్నింగ్స్‌లో షూటింగ్ హడావుడి, కూతురు ఆరాధ్య ఆలనా పాలన వంటి తీరికలేని పనుల మధ్య కూడా ఐశ్వర్యారాయ్ వీలు చేసుకుని ఇవాళ 40వ బర్త్‌డే జరుపుకుంటున్న భర్త అభిషేక్ బచ్చన్‌కు స్పెషల్ పార్టీ ఇచ్చారు. తన కుటుంబంతోబాటు అత్త మామలు జయ, అమితాబ్‌‌లను, ఆడపడుచు శ్వేతా నందాను నిన్న మాల్దీవ్స్‌కు విహారయాత్రకు తీసుకెళ్ళారు. కుటుంబం మొత్తం కిలిసి సాగరజలాల్లో యాచ్‌లో విహరించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యాచ్‌పై తమ కుటుంబసభ్యులంతా కూర్చుని ఉన్న ఫోటోను అమితాబ్ షేర్ చేస్తూ, ‘ఫ్యామిలీ స్టేస్ టుగెదర్, సెయిల్స్ టుగెదర్’ అని రాశారు. ఇవాళ మాల్దీవ్స్‌నుంచి బచ్చన్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్ళి ప్రో కబడ్డీలో అభిషేక్ జట్టు ఆడుతున్న కబడ్డీ మ్యాచ్‌కు హాజరవుతారు. మ్యాచ్ తర్వాత హోటల్ సూట్‌లో సన్నిహితులకు ఐశ్వర్య పార్టీ ఇవ్వబోతున్నారు. 7వ తేదీన తిరిగి ముంబాయికి చేరుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com