తెలంగాణ కుమారస్వామి అవుదామని అక్బరుద్దీన్ ఆశ పడుతున్నారా..?

మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్.. అలియాస్ ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. వీరి చరిత్ర గురించి చెప్పుకుంటే.. దేశాలు దాటి పోవాల్సి వస్తుంది కానీ… రాజకీయంగా చూసుకుంటే మాత్రం.. వీరు పాతబస్తీని పెట్టని కోటగా మార్చుకున్నారు. నిత్యం అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ..తమ కోటలో వేరెవరూ అడుగు పెట్టుకుండా.. రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ఆ తర్వాత కానీ. .. ఎప్పుడూ.. వీరికి రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు. కానీ.. వీరి మద్దతు ఉంటే.. ముస్లింల మద్దతు కనీసం పాతబస్తీలో కాకపోయినా.. ఇతర చోట్ల ఉంటుందన్న ఉద్దేశంతో… అధికార పార్టీలు… సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే.. మజ్లిస్ ఇప్పుడు.. కొత్తగా ఆలోచిస్తోంది. వచ్చే ప్రభుత్వం తమ మీదే ఆధారపడి ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. పోటీ చేస్తున్న ఎనిమిది సీట్లూ గెల్చుకుంటామని.. ఆ సీట్లే.. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమవుతాయని గట్టిగా నమ్ముతోంది.

కర్ణాటకలో … కుమార స్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దరిదాపుల్లో రాకపోయినా.. సీఎం పీఠం దక్కింది. తెలంగాణలోనూ అలాంటి అవకాశమే ఉందని.. మజ్లిస్ అనుకుంటోంది. అన్న అసదుద్దీన్ జాతీయ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే.. తమ్ముడు అక్బరుద్దీన్ తెలంగాణ రాజకీయాలు చూసుకుంటున్నారు. అందుకే అక్బరుద్దీన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్నికల వేడి పెరగక ముందే.. ఆయన కుమారస్వామిలా అవుతానంటూ.. వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. .. పోలింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ.. అలాంటి వ్యాఖ్యలే చేసుకుంటూ పోతున్నారు. కింగ్ కాకపోకపోయినా.. కింగ్ మేకర్లం అవుతామంటున్నారు. అయితే.. నిజంగానే.. ప్రభుత్వ ఏర్పాటు అనేది… మజ్లిస్ బలం మీద ఆధారపడి ఉంటే.. టీఆర్ఎస్‌కు అధికారం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు తమకు మద్దతిస్తుందన్న నమ్మకంతో ఓవైసీ బ్రదర్స్ ఉన్నట్లు మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి.

ఓవైసీ బ్రదర్స్ రాజకీయాలను ఎవరూ నమ్మలేరు..నమ్మే సాహసం కూడా చేయరు. ఎందుకంటే.. వారు ఎవరికీ… ఎప్పుడూ.. ఓ విషయంలో కమిట్‌మెంట్ ఇవ్వరు. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ.. రేపు తమ మద్దతు అవసరం అయితే… కేసీఆర్‌కు చుక్కలు చూపించడం ఖాయం. వాళ్ల చేతుల్లో బందీలుగా పాలన చేయడం కన్నా… అధికారం వదిలి పారిపోవడం అన్నంత హింస ఉంటుందని.. అందరికీ తెలుసు. అందుకే.. కేసీఆర్ కూడా.. ఆ పరిస్థితిని కోరుకోవడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఇలాంటి పరిస్థితే వస్తుదని.. తెలంగాణ ప్రజలను ‌అప్రమత్తం చేసి.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఓవైపీ బ్రదర్స్ మాత్రం.. డిసెంబర్ పదకొండు తర్వాత బాద్ షా లేదా.. బాద్‌షా మేకర్లం అ్నట్లుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close