అఖండ 2 సినిమా నుంచి ఇప్పటివరకు డివైన్ వైబ్ ఉన్న ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చింది. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్ స్టఫ్ కోసం ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు అసలు సిసలైన పాటని వదిలారిప్పుడు. జాజికాయ టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ పాట బాలయ్య ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ట్రీట్.
బాలయ్యకి స్వతహాగా ఓ మాస్ గ్రేస్ ఉంటుంది. ఆ స్టైల్ లో పాట చేస్తే థియేటర్స్ లో వచ్చే కిక్కే వేరు. అలా థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోదగ్గ పాట జాజికాయ. భారీ సెట్ లో చిత్రీకరించిన ఈ పాటలో బాలయ్య డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంగ్ బిగినింగ్ లో బాలయ్య వేసిన ఒక సిగ్నేచర్ స్టెప్పు థియేటర్స్ లో విజిల్స్ వేయించడం ఖాయం.
తమన్ అందరికీ కనెక్ట్ అయ్యే ఒక మాస్ బీట్ ఇచ్చారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. ‘నందమూరి బాలుడాయా.. వందమందికొక్కడాయ.. అల్లరే బోలుడాయ” లైన్స్ భలే క్యాచీగా ఉన్నాయి. ఇంత మాస్ నెంబర్ ని మెలోడీ క్వీన్ శ్రేయ ఘోషల్ కి ఇవ్వడం మరింత ఆకర్షణగా నిలిచింది. బ్రిజేష్ శాండిల్య, శ్రేయ ఘోషల్ తమ ఎనర్జీ మొత్తం ఈ పాటలో నింపారు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్న పాట జాజిజాయ రూపంలో వచ్చేసింది. డిసెంబరు 5న ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.