అఖండ 2 వాయిదాతో గత వారం టాలీవుడ్ బాక్సాఫీసు మూగబోయింది. ఈవారం చిన్న మీడియం సినిమాలు క్యూ కడుతున్నాయి. కార్తి ‘అన్నగారు వస్తారు’ డబ్బింగ్ తో వస్తున్నాడు. కృతిశెట్టి కథానాయిక. నలన్ కుమారస్వామి దర్శకుడు. యాక్షన్, కామెడీ కథతో రూపొందిన సినిమాలో కార్తి పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా వుంది.
నందు హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాని సురేష్ బాబు కొనుకోలు చేశారు.పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత ఆయన మొత్తంకొనుగోలు చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఈనెల 12న వస్తోంది.
రోషన్ కనకాల మోగ్లీతో వస్తున్నాడు. కలర్ ఫోటో ఫేం సందీప్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పీపుల్ మీడియా నిర్మించింది. తొలి సినిమా బబుల్గమ్ రోషన్ కి కలిసిరాలేదు. మోగ్లీ హీరోగా తనకి బ్రేక్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
రాజు రాంబాయి తో మంచి విజయాన్ని అందుకున బన్నీ వాస్, వంశీ నందిపాటి నుంచి మరో సినిమా వస్తుంది. అదే .. ‘ఈషా’. ఈ హారర్ మూవీలో హెబ్బా పటేల్ కథానాయిక. మంచి అభిరుచి వున్న దామోదర్ ప్రసాద్ సమర్పణలో వస్తున్న సినిమా కావడం మరో విశేషం.‘మిస్ టీరియస్’ ‘నా తెలుగోడు’ ‘ఇట్స్ ఓకే గురు’ అనే మరో మూడు చిన్న సినిమాలు కూడా వున్నాయి. అయితే వీటికి సరైన ప్రచారం లేదు.
కాకపోతే.. ఈ వారం సినిమాలకి అఖండ2 భయం వెంటాడుతుంది. వాయిదా పడిన అఖండ డిసెంబర్ 12, లేదా 25 తేదిల్లో వచ్చే అవకాశం వుందనే సమాచారం వస్తున్న తరుణంలో మిగాతా సినిమాలన్నీ ఊగిసలాటలో వున్నాయి. ఒకవేళ 12న వస్తే మాత్రం ఈ వారం చిన్న సినిమాలన్నిటిపై చాలా ప్రభావం ఉంటుంది. రెండురోజుల్లో అఖండ2 రిలీజ్ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
