‘ఆంధ్ర కింగ్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి మహేశ్ బాబు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే దానికి ఒక రోజు ముందుగానే ఈ నెల 27న తెరపైకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్.
28 సోలో డేట్. అంతకుముందు వారం పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు లేవు. కానీ తర్వాత వారం అంటే డిసెంబరు 5న బాలయ్య–బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2’ విడుదల కాబోతోంది. ఇది క్రేజ్ ఉన్న సినిమా. ‘అఖండ’ పెద్ద విజయం సాధించింది. పైగా బోయపాటి–బాలయ్యలది సక్సెస్ఫుల్ కాంబినేషన్. కచ్చితంగా ఓపెనింగ్స్ బాగుంటాయి. ప్రీమియర్స్, ఫ్యాన్స్ షోల సందడి కూడా ఉంటుంది. రామ్ సినిమా ఒక రోజు ముందుకు వస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్‌కి మరింత పుంజుకుంటుంది. అందుకే నిర్మాతలు ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. కాకపోతే… రెండో వారంలో ‘అఖండ 2’తో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాంగ్ రన్ ఉండాలంటే కింగ్ కి మంచి బజ్ రావాల్సిందే. సినిమాకు హిట్ టాక్ వస్తే సరే, ఎబౌ ఏవరేజ్ టాక్ వస్తే మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేసి, సినిమాని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
‘ఆంధ్రా కింగ్ తాలుకా’కు సంబంధించిన పాటలు జనంలోకి బాగానే వెళ్తున్నాయి. టీజర్, ట్రైలర్‌తో సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది.