హ‌మ్మ‌య్య‌.. అఖిల్ మొద‌లెట్టాడు

హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌తో అఖిల్ కెరీర్ డైలామాలో ప‌డిపోయింది. కొత్త ద‌ర్శ‌కుల్ని ఎంచుకోవాలా? అనుభ‌వ‌జ్ఞుల్ని న‌మ్ముకోవాలా? హిట్ సినిమాలున్న‌వాళ్ల‌ని ప‌ట్టుకోవాలా… ఏదీ తేల‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ క‌నిపించాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సెట్ చేయ‌డంతో – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌పై న‌మ్మ‌కం ఉన్నా, లేకున్నా గీతా ఆర్ట్స్‌ని న‌మ్మి అఖిల్ రంగంలోకి దిగిపోయాడు. అయితే ఈ ప్రాజెక్టు ఓకే అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు షూటింగ్ మొద‌లెట్టారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్రీక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. అఖిల్‌పైనే కొన్ని సీన్ల‌ను తెర‌కెక్కిస్తున్నారు. క‌థానాయిక‌ని ఖ‌రారు చేయాల్సివుంది. కొన్ని టైటిళ్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే ఏదీ ఫైన‌లైజ్ కాలేదు. మ‌రో ప‌ది రోజుల పాటు.. హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. రెండో షెడ్యూల్లో హీరోయిన్ అడుగుపెడుతుంది. అక్క‌డి నుంచి సినిమాని ముగించేంత వ‌ర‌కూ నాన్ స్టాప్‌గా సినిమా షూటింగ్ జ‌ర‌పాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close