నాగ్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు… ఇప్ప‌టికే 12 కోట్ల ఖ‌ర్చు

ఈమ‌ధ్య త‌న వార‌సుల సినిమాల‌పై దృష్టి పెట్టాడు నాగార్జున‌. వాళ్ల క‌థ‌లు, క‌థానాయిక‌లు, సినిమాల రిలీజ్ డేట్లు… వీటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌రుస్తున్నాడు. వాళ్ల కెరీర్‌ని ఓ గాడిలో పెట్టాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అయిపోయాడు. నాగ‌చైత‌న్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఓ మాదిరి టాక్ తెచ్చుకొన్నా.. మంచి వ‌సూళ్లు ద‌క్కించుకొంది. దాంతో నాగార్జున కాస్త రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా అఖిల్ సినిమాపై పెట్టేశాడు నాగ్‌. అఖిల్ క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన తొలి చిత్రం అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. అందుకే రెండో సినిమానే.. తొలి సినిమాగా భావించి.. దానిపై వీలైనంత ఫోక‌స్ పెడుతున్నాడు నాగ్‌. ఈ సినిమాని ఎలాగైనా స‌రే, హిట్ చేయాల‌న్న త‌ప‌న‌, క‌సి క‌నిపిస్తోంది నాగ్‌లో. అందుకే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌కి ఫ్రీహ్యాండ్ ఇచ్చేశాడు. బ‌డ్జెట్ విష‌యంలోనూ ఎలాంటి ప‌రిధులు, ప‌రిమితులు విధించ‌డం లేదు. ఇప్ప‌టికే ఈసినిమాపై రూ.12 కోట్లు పెట్టిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ 12 కోట్ల‌తో తీసింది యాక్ష‌న్ దృశ్యాలు మాత్ర‌మే. అంటే ఫైట్ల‌కే రూ.12 కోట్లు అయిపోయాయన్న‌మాట‌. అలాగైతే సినిమాకి మ‌రో రూ.40 కోట్ల‌యినా వేసుకోవాల్సిందే. అఖిల్ తొలి సినిమాకీ ఇలానే భారీగా ఖ‌ర్చు పెట్టారు. కానీ ప్ర‌యోజ‌నం శూన్యం. కాక‌పోతే ఇక్క‌డ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కాబ‌ట్టి… అత‌నిపై నాగ్‌కి అంతులేని గురి కాబ‌ట్టి.. డ‌బ్బులు గుమ్మ‌రిస్తున్నాడు. చూద్దాం.. చివ‌రికి ఏం అవుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com