మ‌న‌సు మార్చుకొన్న అఖిల్‌

తొలి సినిమా అఖిల్‌… అఖిల్‌కి గ‌ట్టి షాక్ ఇచ్చింది. అందులోంచి తేరుకోవ‌డానికి చాలా టైమే తీసుకొన్నాడు. అయితే రెండో సినిమాని మాత్రం ప‌క్కాగా ప్లాన్ చేశాడు. హిట్ల‌తో మంచి దూకుడు మీదున్న వంశీపైడిప‌ల్లిని ప‌ట్టుకొన్నాడు. బాలీవుడ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ యూత్‌ఫుల్ మూవీ యేజ‌వానీ హై దివానీ ని రీమేక్ చేద్దామ‌ని డిసైడ్ అయ్యాడు. వంశీపైడిప‌ల్లి కూడా రీమేక్ సినిమాలు తీయ‌డంలో దిట్టే. అందుకే.. ఈ క‌థే సెట్ట‌యిపోద్ద‌నుకొన్నారంతా. అయితే.. అఖిల్ ఈలోగా మ‌న‌సు మార్చుకొన్నాడు. రీమేక్ సినిమాలు అంత‌గా కాసులు రాల్చ‌డం లేద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించిన అఖిల్‌.. ఇప్పుడు ఆ హిందీ సినిమాని ప‌క్క‌న పెట్టాడ‌ట‌.

ఈలోగా వంశీ ద‌గ్గరున్న మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీకి అఖిల్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. వంశీ కూడా ఈ క‌థ‌ని నాగార్జున‌కు వినిపించి.. నాగ్ అంగీకారాన్ని కూడా సంపాదించాడ‌ట‌. అయితే క‌థ‌పై మ‌రో నెల‌రోజులైనా క‌స‌ర‌త్తు చేయాల్సివుంద‌ని తెలుస్తోంది. లేట‌యినా ఫ‌ర్వాలేదు.. మంచి స్ర్కిప్టుతోనేచేద్దాం అని నాగ్‌, అఖిల్‌లు భ‌రోసా ఇవ్వ‌డంతో వంశీ ఇప్పుడు కొత్త క‌థ‌ని వండి వార్చే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. అంటే.. అఖిల్ రెండో సినిమాకి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close