అభిమానిని క‌లుస్తానంటున్న ‘అయ్య‌గారు’

టాలీవుడ్ లో ‘అయ్య‌గారు’ అనే నిక్ నేమ్ ఏ హీరోకి ఉందో తెలుసా?

– ఇంకెవ‌రు? అఖిల్ కే.

‘కింగ్ కొడుకొచ్చాడు. అయ్య‌గారొచ్చారు… అయ్య‌గారే నెంబ‌ర్ వ‌న్‌’ అంటూ ఓ అభిమాని `హ‌లో` స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఆ త‌ర‌వాత‌… త‌ను మీమ్స్ లో ఎక్కువ‌గా క‌నిపించాడు. మీమ్స్ తో `అయ్య‌గారు` అనే ప‌దం ఎంత పాపుల‌ర్ అయ్యిందంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`లో చివ‌రి డైలాగ్ గా అయ్య‌గారు ని వాడారు. ‘న‌న్ను పెళ్లి చేసుకుంటారా? అయ్య‌గారూ’ అని పూజా హెగ్డేతో అనిపించారు. అలా… ఈ `అయ్య‌గారు` మ‌రింత చేరిపోయింది.

అఖిల్ ఫ్యాన్ అన‌గానే గుర్తొచ్చేది.. ‘అయ్య‌గారు’ ఎపిసోడే. ఇప్పుడు ఈ అభిమానిని అఖిల్ కూడా క‌ల‌వాల‌నుకుంటున్నాడు. “న‌న్ను అయ్య‌గారు అని పిల‌వ‌డంతో మీమ్స్ లో త‌ను బాగా పాపుల‌ర్ అయిపోయాడు. నాకంటే త‌న‌ని ఎక్కువ పాపుల‌ర్ చేశారు. అందుకే చివ‌ర్లో ఆ డైలాగ్ పెట్టాం. అత‌న్ని క‌ల‌వాల‌ని వుంది. త్వ‌ర‌లోనే క‌లుస్తా“ అని త‌న ఫ్యాన్ గురించి చెప్పుకొచ్చాడు అఖిల్. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` రిలీజ్ రోజున కూడా స‌ద‌రు అభిమాని విన్యాసాలు బాగా వైర‌ల్ అయ్యాయి. అఖిల్ పోస్ట‌ర్ కి పాలాభిషేకాలు చేస్తూ – ఫ్లెక్సీ ముందు డాన్సులు చేశాడు ఆ ఫ్యాన్‌. ఇప్పుడు అఖిల్ నుంచే పిలుపు వ‌స్తోంది. ఇది క‌దా అస‌లైన కిక్కు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close