RRR ప్ర‌మోష‌న్ల‌కు అలియా డుమ్మా..?

RRR ప్ర‌మోష‌న్ల జాత‌ర మ‌రోసారి మొద‌లు కానుంది. సంక్రాంతికి ముందు ఈ సినిమా ప్ర‌మోష‌న్లు ఓ రేంజ్‌లో జ‌రిగాయి. అయితే సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఆ ప్ర‌య‌త్నం, ఖర్చంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 25న ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈసారి కూడా ప్ర‌మోష‌న్లు భారీగానే చేద్దామ‌నుకుంటున్నారు. రాధేశ్యామ్ హ‌డావుడి అయిపోయిన వెంట‌నే, ఆర్‌.ఆర్‌.ఆర్ హంగామా మొద‌ల‌వుతుంది.

అయితే ఈసారి ప్ర‌మోషన్ల‌కు అలియాభ‌ట్ రాక‌పోవొచ్చు. దానికి చాలా కార‌ణాలున్నాయి. అందులో మొద‌టిది.. అలియా ఫుల్ బిజీగా ఉంది. ప్ర‌మోష‌న్ల‌కు టైమ్ ఇచ్చేంత తీరిక త‌న‌కు లేదు. పైగా.. ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌మోష‌న్లు ఎప్పుడో అవ్వ‌గొట్టేశాన‌న్న‌ది త‌న ఫీలింగ్. మ‌రోవైపు అలియాని భ‌రించ‌డం నిర్మాణ సంస్థ‌కూ క‌ష్ట‌మే. గ‌త సీజ‌న్ అలియా ప్ర‌మోష‌న్లకు 15 రోజులు కేటాయించింది. ఆ 15 రోజుల్లో అలియా ఖ‌ర్చు 3 కోట్ల‌కుపైగానే అని టాక్‌. అలియా, త‌న స్టాఫ్‌కి ప్ర‌త్యేక విమానాలు, హోటెల్ రూమ్‌లు… వీటికి అక్ష‌రాలా మూడు కోట్ల‌య్యాయ‌ని టాక్‌. ఈసారీ ఇంచుమించుగా అంతే అవుతుంది. అలియా ప్ర‌మోష‌న్ల‌లో ఉండ‌డం వ‌ల్ల ఆర్‌.ఆర్‌.ఆర్‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు, మైలేజీ ఏం ఉండ‌దు.కాబ‌ట్టి.. అలియా లేక‌పోయినా ఎలాంటి ఇబ్బంది లేద‌ని ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్ర‌బృందం భావిస్తోంది. అలియా మ‌హాఅయితే ముంబై ఈవెంట్లో క‌నిపిస్తుందంతే. హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు ఈవెంట్ల‌లో అలియా ఉండ‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close