ముంబైలో ఉండే సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, స్పోర్ట్స్ స్టార్స్ అందరికీ ఇప్పుడు అలీ భాగ్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇళ్లతో పాటు విశాలమైన స్థలాలు ఉన్నాయి. ముంబై సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీభాగ్, ఇక ‘సెలబ్రిటీ ప్యారడైజ్’గా మారిపోతోంది. బాలీవుడ్ నటులు, పారిశ్రామిక వేత్తలు స్థలాలు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. సల్మాన్ నుంచి కోహ్లీ వరకు అక్కడ ఇళ్లు కొనుగోలు చేశారు.
ఈ ప్రాంతంలో 2025లో ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ మార్కెట్ 20-25% వృద్ధి చెందుతోంది, లగ్జరీ విల్లాలు ₹7-15 కోట్లకు అమ్ముడవుతున్నాయి. అలీ భాగంగా ప్రకృతి సౌందర్యం కారణంగా ‘ముంబైయన్స్’ వీకెండ్ గెట్వేలకు ప్రసిద్ధి చెందింది. నాగావ్ బీచ్, కిహిం బీచ్, అలీభాగ్ బీచ్ , కోలాబా ఫోర్ట్, కంకేశ్వర్ టెంపుల్, రేవ్దాండా బీచ్ ఫోర్ట్ వంటి చారిత్రక స్థలాలు ఇక్కడి ప్రత్యేకతలు. ఈ ప్రాంతం శాంతియుత వాతావరణం, పచ్చని ప్రాంతాలు, సముద్ర గాలులతో ఒక రిలాక్స్డ్ లైఫ్‌స్టైల్‌ను అందిస్తుంది.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ , మండ్వా ఫెర్రీ టెర్మినల్ – ద్వారా ముంబై నుండి ప్రయాణ సమయం 90 నిమిషాలకు తగ్గింది. ఇది అలీభాగ్ను లగ్జరీ రెసిడెన్షియల్ హబ్‌గా మార్చింది. ఈ ప్రాంతం లగ్జరీ విల్లా కమ్యూనిటీలు, స్పా రిసార్ట్లు, ఎక్స్క్లూసివ్ క్లబ్‌లతో బ్రాండెడ్ డెవలప్మెంట్లకు హాట్‌స్పాట్‌గా మారింది.
