అన్ని ఎగ్జిట్‌పోల్స్‌లోనూ ఒకే విన్నర్ కేజ్రీవాల్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీదే సంచలనాత్మక విజయం అని.. అన్ని న్యూస్ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 50 నుంచి 60 సీట్లు వరకూ వస్తాయని… అన్ని చానళ్లు అంచనా వేశాయి. న్యూస్‌ ఎక్స్‌ పోల్ స్టార్ట్ ఎగ్జిట్ పోల్ ఆప్‌ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్‌ 0-2 సీట్లు ఇచ్చింది. టైమ్స్‌ నౌ ఐపీఎస్‌వైఎస్ ఫలితాలు ఆప్‌ 44, బీజేపీ 26 స్థానాలుగా తేల్చాయి.

రిపబ్లిక్‌ టీవీ జన్‌కి బాత్ సర్వేలో ఆప్‌ కి 48-61, బీజేపీ 9-21, కాంగ్రెస్‌ 0-1సీట్లుగా తేలింది. న్యూస్‌-18.. ఆప్‌ 44, బీజేపీ 26, ఇండియా టీవీ ఆప్‌ 44, బీజేపీ 26, ఎన్డీటీవీ ఆప్‌ 49, బీజేపీ 20, కాంగ్రెస్‌ 1, ఏబీపీ- సీఓటర్‌ ఆప్‌ 49-63, బీజేపీ 05-19, కాంగ్రెస్‌ 4గా అంచనా వేశాయి.

ఒక్కటంటే.. ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా.. బీజేపీకి అనుకూలంగా రాలేదు. కనీసం.. విజయానికి దగ్గరగా కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత… కేజ్రీవాల్ కు కలసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన ప్రజల కేంద్రం పరిపాలన చేశారని.. డబ్బులు పంచిపెట్టే పథకాల కన్నా.. వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేశారని..అందుకే ప్రజల మద్దతు పొందగలిగారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఫలితాలు ఇంతే వస్తే.. బీజేపీకి వరుస పరాజయాల్లో మరొకటి చేరినట్లవుతుంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత..జరిగిన ఎన్నికల్లో ఒక్క హర్యానాలో మాత్రమే.. ఎన్నికల తర్వాత మిత్రపక్షాన్ని పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close