వైసీపీ పాలన హయాంలో .. దోపిడీని కేంద్రీకరించారు. మద్యం, ఇసుక మొత్తం జగన్ ఖాతాలోకే చేరిపోయింది. ఆయన వేల కోట్లు వెనకేసుకున్నారు. ఆయనకు సంపాదించి పెట్టిన మిథున్ రెడ్డిలాంటి వాళ్లు కొంత మొత్తం వెనకేసుకున్నారు. మరి మిగతా పార్టీ క్యాడర్ అంతా ఏమయింది..?. తమ ఆస్తులు కరగదీసుకుని.. అప్పుల పాలయ్యారు. దివాలా తీశారు. వారి కష్టంతో అధికారంలోకి వచ్చిన జగన్ తాను మాత్రమే దోచుకుని మిగిలిన క్యాడర్ ను గాలికి వదిలేశారు. ఇంత స్వార్థ పరుడి చేతిలో ఉన్న పార్టీకి నేతలుగా అన్నందుకు వారు ఇప్పటికే సిగ్గుపడుతూ ఉండాలి.
మద్యం, ఇసుక సొమ్మంతా జగన్ కే !
గతంలో మద్యం విధానం ఎప్పుడూ ప్రభుత్వం చేతిలో ఉండేది కాదు. దుకాణాలు వేలం వేసేవారు. అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ కు అంతో ఇంతో ఈ దుకాణాలు ఆర్థిక ఆలంబనగా ఉండేవి. కానీ జగన్ రెడ్డి లిక్కర్ పంట తనకే దక్కాలనుకున్నారు. మొత్తం ప్రభుత్వం పేరుతో నాకేశారు. ఇసుక కూడా అంతే. మొత్తం ఒకరికే..తన బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి అడ్డంగా దోచేశారు. ఒక్క ఇసుక, మద్యం కాదు.. కాంట్రాక్టులు ఏమైనా ఉంటే.. తనకు కమిషన్లు ఇచ్చే వారికే వచ్చేలా చేశారు. చివరికి ప్రతి పైసా తనకే దక్కాలన్నట్లుగా ఆయన పని సాగింది.
క్యాడర్ అప్పుల పాలు
జగన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నా.. ఆయన క్యాడర్ కు పదేళ్ల పాటు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. మన ప్లేట్లో మన బిర్యానీ కథలు చెప్పినా చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన వారికి బిల్లులు ఇవ్వలేదు. దాంతో క్యాడర్ పూర్తి స్థాయిలో ఖల్లాస్ అయిపోయారు. ఓ వైపు పూర్తి స్థాయిలో జగన్ అపర కుబేరుడిగా ఎదగగా.. అధికార పార్టీ అనే ట్యాగ్ తో వైసీపీ క్యాడర్ నాశనం అయిపోయారు. మళ్లీ బెట్టింగులు పేరుతో జగన్ ఆడిన నిర్వాకంతో… ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
లీడర్, క్యాడర్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా?
వైసీపీ అధినేత జగన్ .. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కార్యకర్తలు అండగా నిలబడ్డారు. పదేళ్ల పాటు ఆయన కోసం పని చేశారు. వైసీపీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. కానీ అధికారం వచ్చాక వారందర్నీ జగన్ దూరం పెట్టేసి వాలంటీర్లతో కథ నడిపించారు. తన కోసం పని చేసిన వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు మళ్లీ క్యాడర్ అవసరం ఏర్పడింది. అందుకే మళ్లీ మన ప్లేట్లో మన బిర్యానీ కథలు చెబుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లంటున్నారు. కానీ మరోసారి రక్తం పీల్చడానికే ఇలాంటి కథలు .. వైసీపీ లీడర్, క్యాడర్ ఎప్పటికి తెలుసుకుంటారో మరి !