వైసీపీ ఓడిపోయినప్పటి నుండి బయట కనిపించకుండా ఆజ్ఞాతంలో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు.. వైసీపీ సోషల్ మీడియా ఒకప్పటి ఇంచార్జ్..ఇప్పుడు అనధికారిక ఇంచార్జ్ సజ్జల భార్గవరెడ్డికి టైం దగ్గర పడుతోంది. ఇంత కాలం ఆయన తన నిర్వాకాలపై న్యాయపోరాటాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా టైంపాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు గట్టి షాక్ తగిలింది.
వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఇతరుల వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్త.. వేల మందితో సైన్యాన్ని నడిపిస్తూ విచ్చలవిడిగా పోస్టులు పెట్టేవారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడ్డారు. ఈ అంశంపై ఆయనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి పోస్టులు పెట్టారో తెలియదనుకుంటున్నారా అని ప్రశ్నించడమే కాదు.. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే మరింత రెచ్చిపోతారని మండిపడింది. ఇలాంటి వాటిని వ్యవస్థ చూస్తూ ఊరుకోదని తప్పక శిక్షిస్తుందని స్పష్టం చేసింది.
అయితే అరెస్టుపై రెండు వారాల పాటు ఉపశమనం కల్పించింది. ఆ లోపు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తీవ్రత స్పష్టంగా ఉంది కాబట్టి సజ్జల భార్గవ రెడ్డికి రెండు వారాల తర్వాత అసలైన టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన జైలుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.