పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా ‘సుడిగాడు’. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన ‘సుడిగాడు’తో పోలిక తెచ్చారు. అది వేరే సంగతి. ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు ‘సుడిగాడు 2’ ని స్వయంగా రాస్తున్నారు నరేష్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

‘సుడిగాడు ని బాలీవుడ్ లో కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇది స్పూఫ్ సినిమా. అయితే సౌత్ సినిమాలన్నీ ఇలానే ఉంటాయో అనుకున్నారు. ఈమధ్య ఒక ఆలోచన వచ్చింది. బాలీవుడ్ సినిమాలని కూడా తీసుకొని సుడిగాడు లాంటి కథ చేస్తే అప్పుడు అక్కడి ఆడియన్స్ కి కూడా క్లియర్ గా అర్ధమౌతుంది. ఈ ఐడియా రాయడం మొదలుపెట్టా’ అని చెప్పుకొచ్చారు నరేష్.

అలాగే తనకి జోకర్ లాంటి పాత్ర చేయాలని వుందని చెప్పారు. మనం నవ్వితే ప్రేక్షకులు భయపడే పాత్రలో కనిపించాలి. అలాగే వెంకటేష్ గారితో కలసి ఒక సినిమా చేయాలనివుందని, పుష్పక విమానం తన ఫేవరేట్ అని చెప్పిన నరేష్ అలాంటి మూకీ సినిమా భవిష్యత్ లో తప్పకుండా చేస్తానని తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close