అల్లరి నరేశ్ చేస్తున్న థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ. నాని కాసరగడ్డ దర్శకుడు. పొలిమేర, పొలిమేర 2 దర్శకుడు అనిల్ విశ్వనాథ్ షో రన్నర్. కామాక్షి భాస్కర్ల హీరోయిన్. ఈ నెల 21న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ రోజు ట్రైలర్ వదిలారు. థ్రిల్లర్ జానర్ తగ్గట్టుగా ఆసక్తికరంగా వుంది ట్రైలర్.
”నువ్వు చెప్పేది ఏది నమ్మశక్యంగా లేదు’ సాయి కుమార్ డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ అయ్యింది. అంతకుముందు నరేష్ మంచుపర్వతాల్లో నడుచుకుంటే వెళ్ళే షాట్ ఇందులో మరో కీ ఎలిమెంట్.
ఇదొక మర్డర్ కేసు చుట్టూ నడిచే కథ. అయితే ఆ కేసు మామూలుది కాదు. ‘ఎవిడెన్స్ తో లింక్ ఉన్నోడికి మోటివ్ తో పనిలేదు. మోటివ్ ఉన్నవాడికి ఎవిడెన్స్ తో సంబంధం లేదు’ అనే డైలాగ్ కేసులోని లోతుని తెలియజేస్తోంది.
ఒక మిస్టీరియస్ కేస్ తో పాటు బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ కూడా ట్రైలర్ లో కనిపించాయి. నరేష్ లుక్, పెర్ఫార్మెన్స్ కొత్తగా వున్నాయి. కామాక్షి భాస్కర్ల పాత్ర కీలకం. ‘కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అవుతుంది’ అనే మాటతో ట్రైలర్ ముగించారు.
మంచు కొండలలో మొదలైన ట్రైలర్ అదే షూట్ తో ఎండ్ కావడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగులో మంచి థ్రిల్లర్ వచ్చి చాలాకాలం అయింది. ఆ లోటుని 12ఏ రైల్వే కాలనీ భర్తీ చేస్తుందేమో చూడాలి.


