అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు పెద‌వి విరిచారు. నెగిటీవ్ రివ్యూలు ఒక‌వైపు, ఎల‌క్ష‌న్ వేడి మ‌రోవైపు క‌లిసి ఈ సినిమా డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోతుంద‌ని అంతా భావించారు. అయితే కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నం ఏమిటంటే.. ఈ సినిమాకు తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వ‌సూళ్లు బాగున్నాయి. ఆదివారం ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ మంచి ఫుట్ ఫాల్స్ సంపాదించుకొంది. మూడు రోజుల‌కూ క‌లిపి దాదాపు రూ.5 కోట్లు తెచ్చుకొంద‌ని ట్రేడ్ వర్గాలు లెక్క‌గ‌ట్టాయి. ఓటీటీ డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయిన‌ట్టే. ఎలా చూసుకొన్నా నిర్మాత‌లు అటూ ఇటుగా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పాజిటీవ్ టాక్ వ‌చ్చిన సినిమాల‌కే థియేట‌ర్ల‌లో జ‌నం ఉండ‌డం లేదు. అలాంటిది నెగిటీవ్ టాక్‌లోనూ ఈమాత్రం వ‌సూళ్లు ద‌క్కించుకోవ‌డం మంచి విష‌య‌మే. ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ అనే టైటిల్‌, న‌రేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ కావ‌డం, అన్నింటికంటే మించి ప‌బ్లిసిటీ హైప్‌ ఇవ‌న్నీ ఈ సినిమాకు క‌లిసొచ్చాయి. న‌రేష్ ఈమ‌ధ్య కాలంలో చేసిన సోలో హీరోల కంటే `ఆ ఒక్క‌టీ అడ‌క్కు`కు బెట‌ర్ అవుట్ వ‌సూళ్లే వ‌చ్చిన‌ట్టు అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close