అల్లరి నరేష్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు మెహర్ తేజ్‌తో ‘ఆల్కహాల్’ చేస్తున్నాడు. ఇదీ కాన్సెప్ట్ సినిమానే. టీజర్ ఆసక్తికరంగా కట్ చేశారు. ‘లక్షలు లక్షలు సంపాదిస్తావ్. మందు తాగవ్. ఇంకెందుకు రా నీ బతుకు.’ అంటూ సత్య డైలాగ్‌తో కామెడీగా మొదలైన టీజర్… మందు కొడితే అపరిచితుడిగా మారిపోయే నరేష్ పాత్ర తెరపైకి రావడం గమ్మత్తుగా ఉంది.
‘తాగుడుకు సంపాదనకు లింక్ ఏముంది? తాగితే మన మీద మనకు కంట్రోల్ ఉండదు. ఆల్కహాల్ కంట్రోల్ చేయడం నాకు ఇష్టం ఉండదు.’ అంటూ అమాయకంగా డైలాగులు చెప్పిన నరేష్… ఆ తర్వాత తనలో వైలెంట్ యాంగిల్‌ని బయటికి తీస్తారు. రుహాని శర్మ, నిహారిక, హర్షవర్ధన్ ఇలా పెద్ద గ్యాంగ్ ఉంది. ఆల్కహాల్‌కి ఈ గ్యాంగ్‌కి లింక్ ఏమిటనేది సినిమాలోనే చూడాలి. పాయింట్ అయితే క్యాచీగా ఉంది. లిమిటెడ్ లొకేషన్స్‌లో తీసిన ఈ సినిమాలో మంచి ప్రొడక్షన్ డిజైన్ కనిపించింది.
నరేష్ లుక్ కూల్‌గా ఉంటూనే సీరియస్ టోన్‌లో కనిపించింది. సత్య క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంది. ఈ రోజుల్లో సినిమా ఆడియన్స్‌కి పట్టాలంటే ఏదో కొత్త కాన్సెప్ట్ ఉండాల్సిందే. ఆల్కహాల్ ఆ ప్రయత్నమైతే కనిపిస్తోంది. సితార బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న రిలీజ్‌కి రెడీ అవుతోంది.