రాజకీయాలు అంతే. గుడ్డ కాల్చిమీద వేస్తే చాలు .. దాన్ని పట్టుకుని నిజమో కాదో తేల్చకుండా జీవితాంతం ఆరోపించడానికి కొంత మందికి అవకాశం దొరికిపోతుంది. ఇలాంటి వాళ్లే క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు. కడప జిల్లా రైల్వే కోడూరు టిక్కెట్ కోసం ఎన్నారై వేమన సతీష్ కు రూ. ఏడు కోట్లు ఇచ్చామంటూ సుధా మాధవి అనే మహిళ ఏడుస్తూ వీడియో విడుదల చేశారు. వేమన సతీష్ తనను మోసం చేశారని అంటున్నారు.
నిజానికి ఆ మహిళ జడశ్రవణ్ పెట్టిన పార్టీ తరపున పోటీ చేశారు. నిజంగా అప్పటికే వేమన సతీష్ కు కోట్లు ఇచ్చి ఉంటి .. అప్పుడే తీసుకోకుండా వేరే పార్టీ తరపున పోటీ చేసి.. ఏడాదిన్నర తర్వాత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది?. ఆరోపణలు చేస్తున్న మహిళ .. మధ్యతరగతి మహిళ. పెద్ద పెద్ద వ్యాపారాలు ఏమీ లేవు. కానీ ఏడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా ఆమె చెప్పాల్సి ఉంది.
కొద్ది రోజుల కిందట కొలికపూడి శ్రీనివాస్ టిక్కెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు ఈమె తనకు టీడీపీ సభ్యత్వం కార్డు ఉందని.. చంద్రబాబు కోసం దీక్షలు చేశానని చెప్పి ఈ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ వాళ్లకు ఈ ఆరోపణలు హాయిగా ఉంటాయి. ఈమె వెనుక వారు ఉన్నారో లేదో తెలియదు కానీ.. కనీస ఆధారాల్లేని ఆరోపణలు చేయించి.. వ్యక్తిత్వ హననం మాత్రం చేస్తారు. వేమన సతీష్ .. ఎన్నారై. ఆయనకు టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అందరికీ తెలుసు.