నాకూ ఆలియాభట్ కావాలి

పక్కింటి పిన్నిగారు కాసుల పేరు కొనుక్కుంటే ఇరుగింటి మంగళగౌరి కూడా అదే కావాలంటుంది. సినిమా హీరోలు కూడా అదే బాపతు. ఓ క్రేజీ హీరోయిన్ తో ఎవరైనా హీరో చేస్తే, ఇక మిగిలిన హీరోలు అందరూ కూడా ఓ రౌండ్ వేసేస్తారు. ఇది టాలీవుడ్ లో కామన్. అందరు హీరోలు ఒక్కో సినిమా చేసేసాక, ఇక హీరోయిన్ అదృష్టం బాగుంటే మరో చాన్స్ వస్తుంది. అలా వచ్చేవాళ్లు తక్కువ. సమంత, అనుష్క లాంటి వాళ్లు కొద్దిమందికే అలాంటి అవకాశం దక్కింది.

సరే, విషయానికి వస్తే, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తోంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో. భారీ రెమ్యూనిరేషన్ ఇచ్చి తీసుకువచ్చారు. అయితే అదే ఆలియా భట్ ను తన సినిమా కోసం ట్రయ్ చేయమని స్టయిలిష్ స్టార్ బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.

వేణు శ్రీరామ్ డైరక్షన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మించే సినిమా ఈ ఏడాది చివరిలో ప్రారంభం అవుతుంది. అందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా కీలకం. ఆలియాభట్ అయితే బాగుంటుందని, ట్రయ్ చేయమని బన్నీ చెప్పినట్లు బోగట్టా. రెమ్యూనిరేషన్ సమస్య లేదు. బన్నీకి హిందీ శాటిలైట్, డబ్బింగ్ మంచి రేటు వస్తుంది. ఆలియాభట్ తోడయితే ఇంకా బెటర్ రేటు వస్తుంది. కానీ ఆమె ఓకె అనాలి. అదే సమస్య.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close