నాలుగు సినిమాల కష్టం పుష్ప : అల్లు అర్జున్

”రెండేళ్ళ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. పుష్ప నాలుగు సినిమాల కష్టం” అన్నారు అల్లు అర్జున్. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా యూనిట్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, మారుతి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ… సినిమా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
”దేవిశ్రీ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. చంద్రబాస్ ఒకొక్క పాట ఒక్కో స్టయిల్ లో అదరగొట్టారు. సమంత కి థ్యాంక్స్.. వూ కొడతావా పాట మాములుగా వుండదు. దేవిశ్రీ ప్రసాద్- సుకుమార్- అల్లు అర్జున్.. మ్యాజిక్ మళ్ళీ చూస్తారు. రష్మిక వండర్ ఫుల్. అద్భుతంగా నటించింది. మిగతా నటులు, సాంకేతిక వర్గం అద్భుతంగా చేసింది” అని చెప్పుకొచ్చారు.

” సుకుమార్, దేవిశ్రీ ఈ ఈవెంట్ లో లేకపోవడం లోటుగానే వుంది. కానీ అద్భుతమైన ప్రోడక్ట్ ఇవ్వడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. థియేటర్ లో ది బెస్ట్ చూస్తారు. సుకుమార్ నా డార్లింగ్ డైరెక్టర్, నేను సుకుమార్ వేరు కాదు. మా ఇద్దరిలో ఎవరికి పేరు వచ్చినా అది ఇద్దరికీ దక్కుతుంది. నిర్మాతలు అద్భుతంగా సహరించారు. మైత్రి బ్యానర్ లో పుష్ప ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిస్తుంది, డిసెంబర్ 17అందరికీ థియేటర్ లో పార్టీ. పుష్ప రాజ్ .. తగ్గేదేలే” అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు బన్నీ.

ఇదే వేడుకలో బాలకృష్ణ అఖండ సినిమా విజయాన్ని ప్రస్థావించారు అల్లు అర్జున్. అఖండ ప్రేక్షకులని మళ్ళీ థియేటర్ లోకి తీసుకొచ్చింది. అదే జోరుని పుష్ప కొనసాగుస్తుందనే నమ్మకం వుంది. తర్వాత వస్తున్న ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ , ఆచార్య.. ఇలా అన్నీ సినిమాలు విజయాలు సాధించాలి. సినిమా గెలవాలి” అని కోరుకున్నాడు బన్నీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close