థ్రిల్లు బ‌న్నీకి… బిల్లు ప్రొడ్యూస‌ర్‌కి!

హీరోల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డ‌మే నిర్మాత‌ల ప‌ని. అంత‌కంటే పెద్ద అదృష్టం ఏముంటుంది? పైగా స్టార్ హీరోలు ఏం చెబితే అది చేయ‌డానికే ఈవాల్టి నిర్మాత పుట్టాడు. ఎక్క‌డ హీరోగారికి కోపాలు వ‌చ్చేస్తాయో అన్న నిర్మాత‌ల పాలిటి భ‌యాలే.. హీరోల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాలు. ఆయుధాలు. ఇది వ‌ర‌కు సెట్ వ‌ర‌కే హీరోల ఆధిప‌త్యం ఉండేది. క్ర‌మంగా… బిజినెస్‌లోనూ, ఆఖ‌రికి ప్ర‌చారంలోనూ వాళ్ల మాట తు.చ త‌ప్ప‌కుండా పాటించాల్సివ‌స్తోంది. `అల‌.. వైకుంఠ‌పుర‌ములో` సినిమాకి అదే జ‌రిగింది.

ఈ సినిమా హిట్టు నుంచి సూప‌ర్ హిట్టు, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు… ఆల్ టైమ్ ఇండ్ర‌స్ట్రీ హిట్టు వ‌ర‌కు ప‌రిగెట్టింది. సినిమాలో విష‌యం ఉంది కాబట్టి ప్రేక్ష‌కులూ ఆశీర్వ‌దించారు. దానికి మించి బ‌న్నీ త‌న ప్ర‌మోష‌న్ల‌తో ఉక్కిరిబిక్కరి చేశాడు. ఇది వ‌ర‌కు బ‌న్నీ ఏ సినిమాకీ చేయ‌న‌టువంటి ప్ర‌మోష‌న్లు.. ఈ సినిమాకి జ‌రిగాయి. సినిమా విడుద‌ల‌కు ముందు ఒక ఎత్తు. విడుద‌లైన త‌ర‌వాత మ‌రో ఎత్తు. దాదాపు ప‌ది ఈవెంట్లు. అన్నీ భారీగానే. దాని విలువ దాదాపు ఐదారు కోట్లు. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు లేక‌పోయినా నిల‌బ‌డుతుంది. ఎందుకంటే మార్కెట్లో మ‌రో సినిమా లేదు. పైగా ఫ్యామిలీ అంతా చూసే సినిమా క‌నిపించ‌లేదు. దాంతో సంక్రాంతి త‌ర‌వాత కూడా అల వైకుంఠ‌పుర‌ములో హ‌వా కొన‌సాగింది. దానికి బ‌న్నీ ఇచ్చిన ప్ర‌మోష‌న్లు ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయ్యాయో తెలీదు గానీ, ఈ పేరు చెప్పి నిర్మాత‌ల‌కు 5 నుంచి 6 కోట్లు ఖ‌ర్చయ్యాయి. ప్ర‌తీరోజూ పేప‌ర్‌లోనో, టీవీలోనూ త‌మ సినిమా క‌నిపించాల‌న్న త‌ప‌న బ‌న్నీది. త‌న త‌ప‌న అర్థం చేసుకోద‌గిన‌దే. అయితే… ఆ బిల్లు మాత్రం నిర్మాత‌లే ఖ‌ర్చు పెట్టాల్సివ‌చ్చింది. ఈ సినిమాలో గీతా ఆర్ట్స్ నిర్మాణ బాగ‌స్వామి అయిన‌ప్ప‌టికీ.. బిల్లు మాత్రం హారిక హాసిని కే వెళ్లింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.
వాళ్లు కూడా `సినిమా ఎలాగో ఆడేస్తోంది క‌దా, పైగా హీరోగారు హ‌ర్ట‌వుతారు` అని ఇష్టం లేక‌పోయినా.. ఈవెంట్ల‌కు స్పాన‌ర్ చేస్తూనే ఉన్నారు మొన్న మీడియాకి పార్టీ ఇవ్వ‌డంతో ఈ ప్ర‌మోష‌న్ హంగామా ముగిసింది. దాంతో నిర్మాత‌లూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే.. ఈ హ‌వా ఇంకొన్ని రోజులు కొన‌సాగేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close