బ‌న్నీ, సుక్కుల‌ను క‌దిలించిన ఓ కిట్టీ పార్టీ!

ఈనెల 23న ‘మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం’ అనే ఓ చిన్న సినిమా విడుదల అవుతోంది. రావు ర‌మేష్ కీల‌క పాత్ర పోషించారు. మిగిలిన వాళ్లంతా కొత్తే. అయితే ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు అల్లు అర్జున్‌, సుకుమార్ సంయుక్తంగా వ‌స్తున్నారు. ‘పుష్ప 2’లో రావు ర‌మేష్ న‌టిస్తున్నాడు. ఆ ఆబ్లిగేష‌న్ తో బ‌న్నీ, సుకుమార్‌లు ఈ ఈవెంట్ కి వ‌స్తున్నారు అనుకొంటున్నారంతా. కానీ ఈ క‌థ వేరే వుంది.

Also Read : ఈరోజు బ‌న్నీ ఏం మాట్లాడ‌తాడో..?!

సుకుమార్ భార్య త‌బిత ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కురాలుగా వ్య‌వ‌హ‌రించారు. నిజానికి త‌బిత‌కీ ఈ సినిమాకూ ఎలాంటి లింక్ లేదు. ‘మారుతి న‌గ‌ర్‌…’ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్యకు ఓ వ‌దిన ఉన్నారు. ఆమె సుకుమార్ భార్య‌ త‌బిత కిట్టీ పార్టీ ఫ్రెండ్స్‌. ఓ సంద‌ర్భంలో ‘మారుతి న‌గ‌ర్‌’ సినిమా గురించి త‌బిత తెలుసుకొని, కొన్ని సీన్స్ చూశార్ట‌. అదే కిట్టీ పార్టీలో మిగిలిన ఆడ‌వాళ్ల‌కీ ఈ సినిమా చూపించారు. వాళ్లంద‌రికీ బాగా న‌చ్చింది. దాంతో త‌బిత త‌న‌కు తానే ముందుకొచ్చి, ఈ సినిమాని నేను ప్ర‌మోట్ చేస్తా అంటూ ఆ బాధ్య‌త త‌న భుజాల‌పై వేసుకొన్నారు. అలా త‌బిత పేరు ఈ సినిమా పోస్ట‌ర్ పై ప‌డింది. కేవ‌లం త‌బిత అడ‌గ‌డం వ‌ల్లే బ‌న్నీ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావ‌డానికి ఒప్పుకొన్నార్ట‌. అలా త‌బిత రిక‌మెండేష‌న్ ఈ సినిమాకు చాలా స్ట్రాంగ్ గా ప‌ని చేసింది. ఓ కిట్టీ పార్టీ వ‌ల్ల త‌బిత సినిమా చూడ‌డం ఏమిటి, ఆ సినిమాకు ప్ర‌జెంట‌ర్ గా త‌న పేరు ప‌డ‌డం ఏమిటి, ఆ వెంట‌నే బ‌న్నీ, సుకుమార్‌లు ఈ సినిమా ప్ర‌మోషన్లలో పార్ట్ కావ‌డం ఏమిటి? అంతా వింత వింత‌గా ఉంది. చిత్ర‌సీమ‌లో అంతే. ఒక్కోసారి చిన్న చిన్న ప‌రిచ‌యాలు పెద్ద పెద్ద మ‌లుపుల‌కు కార‌ణం అవుతాయి. ఏదైతేనేం.. కిట్టి పార్టీ వ‌ల్ల ‘మారుతి న‌గర్‌’కు గ‌ట్టి ప్ర‌మోషన్ అయితే ల‌భించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close