బ‌న్నీ త‌గ్గాడు… ఇక ఫ్యాన్సే కూల్ అవ్వాలి!

ఈరోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. మామూలుగా అయితే… ఇది చాలా రొటీన్ వ్య‌వ‌హారం. పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ చిన్న ట్వీట్ వెనుక చాలా మేట‌ర్ ఉంది. చాలా ప్రాధాన్యం ఉంది.

ఈమ‌ధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీకీ, జ‌న సైనికుల‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. అల్లు అర్జున్ తెలిసి చేశాడో, తెలియ‌క చేశాడో తెలీదు కానీ, కొన్ని వ్య‌వ‌హారాలు ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గుర‌య్యాయి. నంధ్యాలలో వైసీపీ త‌ర‌పున ప్ర‌చారానికి వెళ్ల‌డం, ఆ గాయం మానుతుండ‌గా ‘న‌చ్చితేనే వెళ్తా..’ అంటూ నోరు జారేయ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేసింది. దాంతో ఫ్యాన్ వార్ మొద‌లైపోయింది. ఆఖ‌రికి జ‌న‌సేన నేత‌లు కూడా బ‌న్నీపై యుద్ధానికి కాలు దువ్వారు. ‘మెగా అభిమానులే లేక‌పోతే నువ్వెంత‌’ అనుకొనేంత స్థాయికి వెళ్లిపోయింది వ్య‌వ‌హారం. ఇది ఇలానే కొన‌సాగ‌డం అటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇటు అల్లు అర్జున్ ఇద్ద‌రు హీరోల‌కూ మంచిది కాదు. బ‌న్నీ సినిమా వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్‌, ప‌వ‌న్ సినిమా వచ్చిన‌ప్పుడు బ‌న్నీ ఫ్యాన్స్ క‌త్తిక‌డితే… అది సినిమాకే న‌ష్టం. ఇది ఏమాత్రం ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రిణామం కాదు. ఇలాంటి ద‌శ‌లో ప‌వ‌న్ పుట్టిన రోజు వ‌చ్చింది. ఇప్పుడు బ‌న్నీ క‌నీసం ట్విట్ట‌ర్‌లో కూడా ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోతే, అది ఇంకా పెద్ద గొడ‌వ అవుతుంది.దాన్నే భూత‌ద్దంలో చూపిస్తూ ఇరు వ‌ర్గాలూ మ‌రింత రెచ్చిపోయేవారు. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకొని బన్నీ త‌న వైపు నుంచి ఎలాంటి త‌ప్పూ లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ‘మా మ‌ధ్య గొడ‌వ‌ల్లేవు’ అనే సంకేతాన్ని ప‌రోక్షంగా పంపించాడు. మొత్త‌మ్మీద‌ ఈ వ్య‌వ‌హారంలో బ‌న్నీ కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్టే అనిపిస్తోంది. ఇక ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా కూల్ అయితే, ఈ గ్యాప్ మొత్తం క్లియ‌ర్ అయిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్‌చ‌ర‌ణ్‌?

రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది....

బాచుపల్లిలో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు !

బాచుపల్లి అంటే అమ్మో కాస్ట్ లీనా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఒకప్పుడు అబ్బో బాచుపల్లినా అంత దూరం ఎవరు వస్తారు అనుకునేవారు. ఒకప్పుడు అంటే.. ఎంతో కాలంకిందట కాదు.. జస్ట్ పదేళ్ల...

సెప్టెంబర్ 17 ఓన్లీ నిమజ్జనం డే !

సెప్టెంబర్ 17 అంటే.. తెలంగాణ రాజకీయాలకు ఓ ఊపు వస్తుంది. దాదాపుగా నెల రోజుల ముందు నుంచే మాటల మంటలు ప్రారంభమవుతాయి. ఆ రోజున వారి వారి పార్టీల విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు...

జగన్ మానసిక స్థితిపై క్లారిటీ కోరుకుంటున్న క్యాడర్

జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి గురించి ఆ పార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకుంటారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడానికి ఏ మాత్రం సంకోచించని ఆయన అధికారం ఉన్నప్పుడు.. లేనప్పుడు.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close