రామ్‌చరణ్, అల్లు అర్జున్…. వీళ్లిద్దరూ కలసి నటిస్తే ఎలా ఉంటుంది? రచ్చ రచ్చే. ఎవడులో బన్నీ ఓ చిన్న పాత్ర చేశాడు. కానీ ఆ సినిమాలో బన్నీ ఇంపార్ట్ మామూలుగా ఉండదు. కనిపించేది కాసేపే అయినా తన గురించి మాట్లాడుకొనేలా చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి నటించే అవకాశం ఉన్నట్టు టాక్. రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దృవ. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్కి రీమేక్ ఇది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ అతిథి పాత్రలో మెరవబోతున్నట్టు టాక్. గీతా ఆర్ట్స్ బేనర్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. అంటే బన్నీ సొంత సినిమానే. ఈ సినిమాలో బన్నీ కూడా ఉన్నాడంటే ఆమైలేజీనే వేరుగా ఉంటుంది. పైగా సురేందర్‌రెడ్డికీ బన్నీకీ మంచి రాపో ఉంది. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రేసుగుర్రం బన్నీ కెరీర్లోనే మెమొరబుల్ హిట్‌గా మిగిలిపోయింది. దానికి తోడు ఈ ప్రాజెక్టు సెట్ చేసింది బన్నీనే. సో.. దృవలో బన్నీ ఎంట్రీ ఖాయం అవ్వడానికి ఇంతకంటే పునాది ఏం కావాలి?
దృవలో బన్నీ కూడా ఉంటే బాగుంటుందన్న ఆలోచన సురేందర్‌రెడ్డికి రావడం, దీనిపై బన్నీతో సుదీర్ఘంగా చర్చిండం జరిగిపోయాయట. అయితే బన్నీ కి సరిపడ పాత్ర… దృవలో లేదు. అయినా సరే… ఓ చిన్న కామియో చేయిద్దామన్న ఆలోచనలో ఉందట దృవ టీమ్. లేదంటే కనీసం వాయిస్ ఓవర్ రూపంలో అయినా వాడుకోవాలని చూస్తున్నార్ట. దీనిపై బన్నీ ఇంకా తన డిసీజన్ చెప్పకపోయినా.. దృవ మార్కెట్ పెంచుకొనే దృష్ట్యా బన్నీ తప్పకుండా ఈ టీమ్‌తో జత కట్టబోతున్నాడని టాక్. సో… ఎవడు మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయమన్నమాట.