సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను ఏ 11గా నిర్దారించి ఆయన పాత్రను ఖరారు చేసి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. ఏ1గా సంధ్యా ధియేటర్ యాజమాన్యాన్ని పెట్టారు. తర్వాత ధియేటర్ మేనేజర్, అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది ఇతరుల్ని నిందితులుగా పెట్టారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు.
పుష్ప 2 సినిమా విడుదల ముందు రోజు ప్రీమియర్ కోసం.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా ధియేటర్ కు అల్లు అర్జున్ వచ్చారు. ర్యాలీగా ధియేటర్లో టిక్కెట్లు తీసుకున్న వారిని కాకుండా.. అందర్నీ అనుమతించడంతో కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్ కాసేపు సినిమా చూసి వెళ్లిపోయారు. కానీ ధియేటర్ లో ఆయనను చూసేందుకు ఎగబడటంతో కుర్చీల్లో కూర్చున్న రేవతి అనే మహిళ.. ఆమె ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో చిక్కుకున్నారు ఎలాగోలా వారి అమ్మాయిని తండ్రి బయటకు తీసుకెళ్లాడు కానీ వారిద్దరు మాత్రం.. తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి వెళ్లక ముందే రేవతి చనిపోయారు. బతికే ఉన్నా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం.. చలనం లేకుండా ఉండిపోయారు. బ్రెయిన్ కు చాలా సేపు ఊపిరి ఆడకపోవడంతో తీవ్రంగా డ్యామేజ్ జరిగిందని వైద్యులు తేల్చారు.
థియేటర్ సామర్థ్యానికి మించి జనాలు వస్తున్నారని తెలిసినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో విఫలమవడం వల్లనే ఈ ప్రాణనష్టం జరిగిందని పోలీసులు తమ చార్జిషీటులో స్పష్టం చేశారు. థియేటర్ వద్ద కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని సాంకేతిక ఆధారాలతో పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు.ఒక రోజు అధికారికంగా జైల్లో ఉండాల్సి వచ్చింది.
