క‌థ లేకుండానే ‘లాక్‌’ చేసేశాడా?

అల్లు అర్జున్ మంచి స్పీడుమీదున్నాడు. ‘పుష్ష‌’ ప‌ట్టాల‌పైకి ఎక్క‌లేదు.. ఈలోగా రెండు సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు. అందులో కొర‌టాల శివ‌తో ఒక‌టి. ఈమ‌ధ్యే.. ఓ కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. దాంతో.. ఈ సినిమా క‌థ లాక్ అయిపోయింద‌న్న ప్రచారం జ‌రిగింది. నిజానికి.. బ‌న్నీకి కొర‌టాల క‌థే చెప్ప‌లేద‌ట‌. జ‌స్ట్..పాయింట్‌, దాంతో పాటు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ వివ‌రించాడట‌. అంతే. అది న‌చ్చే బ‌న్నీ ఈ సినిమా క‌థేంటో విన‌కుండానే ప్రాజెక్టు ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది.

అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. త‌న క‌థ‌ల‌న్నీ బ‌ల‌మైన‌వే. అందుకే బ‌న్నీకి కొర‌టాల అంటే అంత న‌మ్మ‌కం. నిజానికి బ‌న్నీ స్టైలే అంత‌. ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కం ఉంచి – ప్రాజెక్టు ఓకే చేసేస్తాడు. ఆ త‌ర‌వాత క‌థ దానంత‌ట అదే పుట్టుకొస్తుంద‌న్న ధీమా బ‌న్నీది. `అల వైకుంఠ‌పుర‌ములో` ఒప్పుకునే ముందు బ‌న్నీ క‌థేం విన‌లేదు. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ ఓ టీమ్ గా ఏర్ప‌డ్డాక‌.. క‌థ అల్లుకున్నారు. `పుష్ష‌`కి ముందు కూడా అంతే. మ‌హేష్ కాద‌న్న త‌ర‌వాత‌. క‌థేమిటో తెలియ‌కుండానే సుకుమార్ ని పిలిపించి `ఈ సినిమా మ‌నం చేద్దాం` అంటూ మాట ఇచ్చేశాడు. కొర‌టాల త‌ర‌వాత బ‌న్నీ మ‌రోసారి త్రివిక్ర‌మ్ తో ఓ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అది క‌నీసం లైన్ గా కూడా లేదు. కేవ‌లం త్రివిక్ర‌మ్ పై ఉన్న న‌మ్మ‌కంతో.. ఈ ప్రాజెక్టు ఓకే చేసేశాడు. ఓ స్టార్ హీరో.. క‌థ‌కంటే ద‌ర్శ‌కుల్ని న‌మ్మ‌డం, క‌థ రెడీ కాకుండానే.. సినిమాల్ని ఓకే చేసేయ‌డం విభిన్న‌మైన స్ట్రాట‌జీనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

ఏపీలో యాప్‌ ద్వారా పోలీస్ సేవలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే ఓ కొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ పోలీస్‌ సర్వీస్‌ యాప్‌ను...

HOT NEWS

[X] Close
[X] Close