ఈమధ్య టైటిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కవితాత్మకం కొన్నయితే, వాటిలో షాక్ ఇస్తున్నవి కొన్ని. వెరైటీ ఇంటి పేర్లతో కూడా కొన్ని టైటిళ్లు వస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా. అల్లు అర్జున్ కొత్త సినిమాకి డిజే అనే పేరు సెలెక్ట్ చేశారు. డిజే అంటే మీనింగ్ ఉందండోయ్.. దువ్వాడ జగన్నాథమ్ అట. అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సోమవారం నుంచి లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాకి డీజే (దువ్వాడ జగన్నాథమ్) అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. సోమవారం ఉదయం 7.45 గం.లకు ఫిల్మ్‌నగర్ టెంపుల్లో క్లాప్ కొట్టుకోనుంది ఈ చిత్రం. సెప్టెంబరులో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కథానాయిక ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. సంగీత బాధ్యతలు మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌కి అప్పగించారు. ఈ టైటిల్ కి బన్నీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.