పుష్ష‌: భార్యా భ‌ర్త‌ల క‌థ‌

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో త‌యార‌వుతున్న సినిమా `పుష్ష‌`. ఈ సినిమా గురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా, ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ అనే మాట్లాడుకున్నారు. నిజానికి.. ఇదో ఫ్యామిలీ డ్రామా. భార్యాభ‌ర్త‌ల క‌థ‌. సుకుమార్ త‌న క‌థ‌లో ఎలాంటి పాయింట్ ట‌చ్ చేసినా.. దానికి ఎమోష‌న్ జోడించ‌డం మ‌ర్చిపోడు. `100 % ల‌వ్‌`లో లెక్క‌లుంటాయి. కానీ బావామ‌ర‌ద‌ళ్ల ఇగో కూడా క‌నిపిస్తుంది. `నాన్న‌కు ప్రేమ‌తో`లో రివెంజ్ ఉంటుంది. కానీ తండ్రీ కొడుకుల ఎమోష‌న్ ఉంటుంది. `రంగ‌స్థ‌లం`లో రాజకీయం ఉంటుంది. కానీ అన్నా, తమ్ముళ్ల అనుబంధం కూడా ఆవిష్కృత‌మ‌వుతుంది.

ఈసారీ అంతే. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌ని సుకుమార్ ఓ పాయింట్ గా తీసుకున్నాడు. అయితే దానికి భార్యా భ‌ర్త‌ల బంధాన్ని జోడించి చెప్ప‌బోతున్నాడు. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ సీన్లు, డ్యూయెట్లు ఇవేమీ ఈ సినిమాలో ఉండ‌వు. తొలి స‌న్నివేశం నుంచే.. బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌ను భార్యాభ‌ర్త‌లుగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ట. అంటే తొలిసారి బ‌న్నీని ఓ భ‌ర్త‌గా చూడ‌బోతున్నాం అన్న‌మాట‌. ఎంత వ‌య‌సొచ్చినా మ‌న హీరోలు ల‌వ్ ట్రాక్‌లు న‌డ‌పడానికీ, హీరోయిన్ల‌ని టీజింగ్ చేయ‌డానికి చూస్తుంటారు. ఈ సినిమాకి మాత్రం.. ఆ ప‌ద్ధ‌తి మార్చాడు సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close