న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లో బ‌న్నీ

అల వైకుంఠ‌పురం మూడ్ నుంచి అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చి, కొత్త సినిమాపై ఫోక‌స్ చేస్తున్నాడు. బ‌న్నీ త‌దుప‌రి సినిమా సుకుమార్‌తో అన్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఫిబ్ర‌వ‌రిలోనే ఈ కాంబో ప‌ట్టాలెక్కాలి. కానీ.. బ‌న్నీ ఇంకాస్త విరామం కోరుకోవ‌డంతో షూటింగ్ ఆలస్య‌మైంది. ఇప్పుడు బ‌న్నీ సెల‌వ‌ల‌న్నీ అయిపోయాయి. సుక్కు సినిమాని మొద‌లెట్టేయ‌డ‌మే ఆల‌స్యం. అందుకు ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయింది. ఈనెల 15 నుంచి బ‌న్నీ – సుకుమార్ సినిమాకి క్లాప్ కొట్టేస్తున్నారు.

న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లో ఈనెల 15 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో బ‌న్నీతో పాటు ప్ర‌ధాన న‌టీన‌టులు అంతా పాల్గొంటార‌ని టాక్‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. బ‌న్నీ చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నాడు. త‌న గెట‌ప్ కూడా వైవిధ్యంగా ఉండ‌బోతోంది. కాస్ట్యూమ్స్ పై కూడా బ‌న్నీ శ్ర‌ద్ధ పెట్టాడు. అందుకోసం ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ఓ బృందం వ‌చ్చి బ‌న్నీ కోసం ప‌ని చేస్తోంది. ఈ సినిమా కోసం నాలుగైదు టైటిళ్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వాటిలో ఒక‌టి త్వ‌ర‌లోనే ప్ర‌కటిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ బడ్జెట్ తగ్గించేస్తున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర పద్దును సీఎం కేసీఆర్ మళ్లీ తగ్గిస్తున్నారు. ఈ సారి కరోనా కారణం. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌ను కేసీఆర్ భారీగా తగ్గించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గిపోయిందని...

ఏపీ మార్క్ : ఆ గుంతల రోడ్లకే టోల్ ఫీజులు.. ఫైన్లు కూడా..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడంతో... రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ రోడ్ల సౌందర్యం హల్ చల్ చేస్తున్నాయి. అదే...

రెండే ఆప్షన్స్ : పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో ఇచ్చిన ఒకే ఒక్క రియలిస్టిక్ హామీ పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రతీ పైసా భరిస్తామని చట్టంలో పెట్టారు. కానీ ప్రత్యేకహోదాను ఎలా చేశారో.....

పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత...

HOT NEWS

[X] Close
[X] Close