2025 లో అల్లు అర్జున్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 2024 డిసెంబరులో ‘పుష్ప 2’ వచ్చింది. 2025 అంతా..అట్లీ సినిమాతోనే గడిపేశాడు బన్నీ. ఈయేడాది మే, జూన్ నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుందని, 2026లోనే ఈ సినిమాని విడుదల చేస్తారని అనుకొన్నారంతా. అయితే ఈ సినిమా 2026లో కూడా వచ్చేఅవకాశాలు లేవని తెలుస్తోంది. ఈయేడాది అక్టోబరు వరకూ బన్నీ ఈ సినిమాకు డేట్లు కేటాయించారని, ఆ తరవాత వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలిపే ఛాన్స్ వుంది. అయితే.. అట్లీ స్పీడు పెంచాల్సిన అవసరం వుంది.
నిజానికి అట్లీ చాలా స్పీడుగా సినిమాలు తీస్తాడు. ఎంత పెద్ద స్టార్ అయినా, చక చక తన సినిమా పూర్తి చేస్తాడు. ఆ లెక్కలోనే ఈ సినిమా కూడా 2026 వేసవికల్లా సిద్ధం అవుతుందని అనుకొన్నారు. కానీ… వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం, మధ్యమధ్యలో అనుకోని బ్రేకుల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. మేకింగ్ విషయంలో అట్లీ రాజీ పడకపోవడం వల్ల కూడా సినిమా ఆలస్యం అవుతోంది. లేట్ అయినా సరే, క్వాలిటీ ప్రోడక్ట్ అందివ్వాలని బన్నీ భావిస్తున్నాడు. అందుకే.. 2027 వరకూ ఈ సినిమా రాకపోవొచ్చు. అట్లీ సినిమా పూర్తయ్యే వరకూ బన్నీ మరో సినిమా చేయడా, లేదంటే… మధ్యలోనే ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడా? అనేది చూడాలి. ఒకవేళ అట్లీ సినిమా పూర్తవ్వకుండానే మరో సినిమా మొదలెట్టాలనుకొంటే బన్నీ దగ్గర ఆప్షన్లు కూడా బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, లోకేశ్ కనగరాజ్.. ఇలా కొంతమంది దర్శకులు బన్నీ కోసం కథలు సిద్ధం చేసుకొంటున్నారు. ఓ బాలీవుడ్ దర్శకుడు కూడా బన్నీ అప్పాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు టాక్.