ఇండియాలో బిగ్గెస్ట్ టాక్ షో ఇదే: అల్లు అర‌వింద్‌

ఓటీటీ వేదిక‌ ఆహాకి స‌రికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అన్ స్టాప‌బుల్ షో. ఇప్పుడు సెకండ్ సీజ‌న్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ షోకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తీసుకొచ్చి శుభం కార్డు వేసింది ఆహా! ఈ సంద‌ర్భంగా ఇండియాలో బిగ్గెస్ట్ టాక్ షో… అన్ స్టాప‌బుల్ అంటూ ప్ర‌క‌టించేశారు అల్లు అర‌వింద్‌. అస‌లు ఈ షో.. ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకోలేద‌ని, ఇండియా మొత్తం ఇప్పుడు అన్ స్టాప‌బుల్ వైపు చూస్తోంద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అన్ స్టాప‌బుల్ సూప‌ర్ హిట్ అయిన మాట వాస్త‌వం. తెలుగు టాక్ షోల‌లో.. దీనిదే అగ్ర తాంబూలం. అయితే.. ఇండియాలో మ‌రిన్ని గొప్ప టాక్ షోలు ఉన్నాయి. కాఫీ విత్ క‌ర‌ణ్‌, క‌పిల్ శ‌ర్మ షో కూడా… టాప్ 1, 2ల‌లో ఉంటుంది. వాటికి రేటింగులు కూడా ఎక్కువే. కాక‌పోతే.. తెలుగులో ఇంత పాపుల‌ర్ అయిన షో లేదు. బాల‌కృష్ణ‌ని టాక్ షోకి తీసుకురావ‌డం.. ఆహా చేసిన తెలివైన ప‌ని. కేవ‌లం బాల‌య్య వ‌ల్లే ఈ షోకి ఇంత గ్లామ‌ర్ వ‌చ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెస్ట్ గా తీసుకొచ్చి…. అన్ స్టాప‌బుల్ 2 కి.. స‌రైన ముగింపే ఇచ్చారు. ఇక ఈ షోలో ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయా? వాటికి ప‌వ‌న్ ఎలాంటి స‌మాధానాలు చెబుతాడా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close