అల్లు శిరీష్ కొత్త ప్ర‌య‌త్నం

`గో లోక‌ల్ – బీ వోక‌ల్‌` అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నాడు అల్లు శిరీష్. స్వ‌దేశీ వ‌స్తువుల్ని కొందాం… వాటిని ప్ర‌చారం చేద్దామ‌న్న‌ది శిరీష్ చెబుతున్న మాట‌. మ‌న‌లో చాలామందికి ఫారెన్ గూడ్స్ అంటే మక్కువ ఎక్కువ‌. నాణ్యంగా ఉంటాయ‌న్న న‌మ్మం. ఫారెన్ గూడ్స్ కొన్నాక గ‌ర్వంగా చెప్పుకుంటాం కూడా. కానీ.. ఫారెన్ వ‌స్తువులు కొన‌డం వ‌ల్ల‌, ఆ దేశంలోని కంపెనీలు బాగుప‌డ‌తాయి. అదే.. మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువులు కొంటే, ఇక్క‌డి కంపెనీలు వృద్ధిలోకి వ‌స్తాయి. దాని వ‌ల్ల‌.. ఉపాధి పెరుగుతుంది. ఆర్థికంగా దేశం ప‌రిపుష్టం అవుతుంది. ఇదీ… ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం.

ఇందులో భాగంగా 12 మంది సెల‌బ్రెటీల‌కు అల్లు శిరీష్ కొన్ని గిఫ్ట్ ప్యాక్‌ల‌ను పంపాడు. అందులో ఉన్న‌వ‌న్నీ స్వ‌దేశీ వ‌స్తువులే. ఈర‌కంగా… ఆయా వ‌స్తువుల‌కు కాస్త ప్ర‌చారం క‌ల్పిస్తున్నాడు. ఈ ఆలోచ‌న శిరీష్ కి ఎలా వ‌చ్చింది? త‌న భ‌విష్య ప్ర‌ణాళిక‌లేంటి?

“నిజానికి ఇది నా ఆలోచ‌న కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ గ‌తంలో ఇలాంటి క్యాంపెయిన్ ఒక‌టి నిర్వ‌హించారు. ఈ ఐడియా నాకు న‌చ్చింది. భార‌తీయ వ‌స్తువులు కొంటే. మ‌న దేశానికి ప‌రోక్షంగా సేవ చేసిన‌వాళ్ల‌వుతాం అనిపించింది. అందుకే.. ఈ క్యాంపెయిన్‌ని నేను ముందుకు తీసుకెళ్దామ‌నుకుంటున్నా. విదేశీ వ‌స్తువుల్ని శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించ‌డం ప్రాక్టిక‌ల్ గా సాధ్యం కాదు. కానీ వీలైనంత వ‌ర‌కూ స్వ‌దేశీ వ‌స్తువుల్ని కొందాం. వాటినిక ప్ర‌చారంలోకి తీసుకొద్దాం. మ‌న‌లో చాలామంది స్వ‌దేశీ వ‌స్తువులు కొంటున్నా, బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డం లేదు. ఆ ప‌ద్ధ‌తి మారాలి. 12 మంది సెల‌బ్రెటీల‌ను ఎంపిక చేసి వాళ్ల‌కు మ‌న స్వ‌దేశీ వ‌స్తువుల్ని కొన్ని పంపాను. అవ‌న్నీ వాళ్ల‌కు బాగా న‌చ్చాయి. `ఇవి ఎక్క‌డ కొన్నావ్‌? రేటెంత‌` అని ఆస‌క్తిగా అడుగుతున్నారు. నాణ్య‌త ప‌రంగా విదేశీ వ‌స్తువుల‌కు ధీటుగా మ‌న ద‌గ్గ‌రా క్వాలిటీ ప్రొడెక్ట్ త‌యార‌వుతోంది. ధ‌ర కూడా త‌క్కువే. వాటిని గుర్తించి ప్రోత్స‌హిద్దాం. బ‌జాజ్‌, డాబ‌ర్ వంటి బ్రాండ్ ల జోలికి నేను వెళ్ల‌డం లేదు. ఎందుకంటే వాటికి రావ‌ల్సిన పేరు ఇప్ప‌టికే వ‌చ్చేసింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న చిన్న బ్రాండ్‌లను కూడా ప్రోత్స‌హిద్దాం. అలాగ‌ని నేనేం విదేశీ వ‌స్తువుకో, చైనా ప్రొడక్ట్స్ కో వ్య‌తిరేకం కాదు. ఈ క్యాంపెయిన్ ని జ‌నంలోకి తీసుకెళ్దామ‌న్న ఆలోచ‌న ఉంది. అందుకోసం ర‌క‌ర‌కాల మార్గాల్ని అన్వేషిస్తున్నా” అని చెప్పుకొచ్చాడు శిరీష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close