ఇద్దరమ్మాయిలు, నాయక్ లాంటి సినిమాలతో అలరించింది అమలాపాల్. స్టార్ హీరోలతో నటించినా.. రావల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. దానికి తోడు ఫ్లాపులూ ఎదురయ్యాయి. తెలుగులో కంటే తమిళంలోనే బాగుందని అక్కడ దృష్టి పెట్టింది. దానికి తోడు విజయ్‌ని పెళ్లి చేసుకొని సెటిలైపోదామనుకొంది. అయితే అమలాపాల్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. విజయ్‌తో విబేధాలొచ్చి.. ఆ జంట విడిపోయింది. విజయ్‌తో విడిపోయిన తరవాత సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టింది అమలాపాల్. తనకు తమిళం నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. అయితే… తెలుగులో మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ‘నేను మళ్లీ నటించడానికి సిద్దంగా ఉన్నా..’ అన్నా సరే… అమలాపాల్ పేరుని కనీసం పరిశీలనకు కూడా తీసుకోవడం లేదు.
దాంతో అమలాపాల్ స్వయంగా రంగంలోకి దిగిపోయింది. టాలీవుడ్లో అమలాపాల్‌కు ఇది వరకు మేనేజర్లు లేరు. ఇప్పుడు తన కోసం ఓ మేనేజర్ని సెట్ చేసుకొంది అమలా. అంతేకాదు.. తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు టచ్‌లోకి వెళ్తోందట. హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ తీసుకోవాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించే చిత్రంలో అమలకు ఆఫర్ వచ్చింది. ‘నరేష్‌తో నటిస్తే… రీ ఎంట్రీ అంత గొప్పగా ఉండదేమో’ అనుకొని ఆ సినిమా చేయాలా, వద్దా అని తటపటాయించింది. అయితే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. రకుల్ నుంచి కీర్తి సురేష్ వరకూ టాలీవుడ్లో హల్ చల్ చేస్తున్న కథానాయికల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీళ్లందరి మధ్య అమలాపాల్‌ని పట్టించుకొంటారా? ఆమె ప్రయత్నాలు సఫలమవుతాయా? డౌటే.