అమ‌లాపాల్‌… మ‌ళ్లీ పెళ్లి

ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో ప్రేమాయ‌ణం.. ఆ త‌ర‌వాత పెళ్లి – సినిమాటిక్ లెవిల్లో చ‌క చ‌క న‌డిపేసింది అమ‌లాపాల్. ఆ ముచ్చ‌ట మూణ్ణాళ్లే. ఎంత త్వ‌ర‌గా క‌లుసుకొన్నారో, అంతే త్వ‌ర‌గా విడిపోయారు. అయితే విడాకులు కూడా ఇద్ద‌రూ ఇష్ట‌పూర్వ‌కంగానే తీసుకొన్నారు. విడిపోయాక అమ‌లాపాల్ గురించి విజ‌య్‌… విజ‌య్ గురించి అమ‌లాపాల్ చెడుగా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ఇప్ప‌టికీ ‘విజ‌య్ మంచోడే’ అంటుంది అమ‌లాపాల్‌. విజ‌య్ గురించి గొప్ప‌గానే చెబుతుంది. ”మా అనుబంధం ఇంత త్వ‌ర‌గా ముగుస్తుంద‌నుకోలేదు. విజ‌య్ ప‌ట్ల నాకు ఇప్ప‌టికీ గౌర‌వం ఉంది. న‌న్ను బాగా చూసుకొన్నాడు” అంటూ విజ‌య్‌కి కితాబు ఇచ్చింది అమ‌లాపాల్‌. ప్రేమ‌లో – పెళ్లిలో ఓ సారి విఫ‌ల‌మైనంత మాత్రాన జీవితం ఆగిపోలేద‌ని, ప్రేమ – వివాహ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఇంకా న‌మ్మ‌కాలు ఉన్నాయంటోంది.

మ‌రి మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మేనా?? అని అడిగితే… ”త‌ప్ప‌కుండా చేసుకొంటా. నా జీవితాన్ని ఇలానే ఒంట‌రిగా గ‌డిపేయ‌డానికి సిద్ధంగా లేను. జీవితంలో ఒక‌రి తోడు మ‌రొక‌రికి అవ‌స‌రం. అయితే ఈసారి చేసిన త‌ప్పు చేయ‌కూడ‌దు. జీవితాంతం వెంట నిలిచే ఓ తోడు వెదుక్కోవాలి. రెండో పెళ్లి క‌చ్చితంగా చేసుకొంటా. అయితే ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్ప‌లేను” అంటోంది. సో… అమ‌లాపాల్ రెండో పెళ్లికి సిద్ధ‌మ‌న్న‌మాట‌. ఈ వార్త తెలిశాక త‌న‌కు ఎన్ని ప్ర‌పోజ‌ల్స్ వ‌స్తాయో మ‌రి. ఈలోగా సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టాల‌ని భావిస్తోంద‌ట అమ‌లాపాల్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com