ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైయస్ఆర్సీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత దాడి గురించి, దాని తదనంతరం ఆ పార్టీలో జరిగిన పరిణామాలు గురించి మాట్లాడారు.
జగన్ ఆమధ్య, పవన్ కళ్యాణ్ నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని, బయటి వాళ్లు ఎవరైనా అలా చేసుకుంటే బొక్కలో పెడతారని, కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడని, నాటు భాషలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడడం తెలిసిందే. అయితే ఆ దాడి బూమరాంగ్ అవడంతో ఆ తర్వాత ఆ పార్టీ నాయకులు డిఫెన్స్‌లో పడడం కూడా తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడు ఒక టీవీ ఛానల్ వైఎస్ఆర్ సీపీ నాయకులను డిబేట్ కోసం పిలిస్తే, వాళ్ళు ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని చెప్పిన విషయం కూడా తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆరోజు జగన్ ఆ తరహా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ పార్టీ నాయకులంతా తల పట్టుకున్నారని చెప్పాడు. అలాగే ఆ పార్టీలో తనకు తెలిసిన నాయకులు చాలామంది ఉన్నారని, దాదాపు 20 మంది వైయస్సార్ సిపి నాయకులతో తాను మాట్లాడానని, అందరూ జగన్ చేసిన పని వల్ల పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగిందని వాపోయారని కృష్ణమోహన్ చెప్పారు.
అదేవిధంగా జనసేన పార్టీ మీద తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు ఆమంచి కృష్ణమోహన్. ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్, జనసేన కచ్చితంగా ఎన్నికలలో ప్రభావం చూపుతుందని, చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.