అమరావతి రైతులకు కరోనా కంటే ప్రభుత్వ భయమే ఎక్కువ..!

వైరస్ కారణంగా ఎవరూ ఇంట్లోకి రావొద్దని లాక్ డౌన్ ప్రకటించేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పేరుతో అమరావతి రైతుల్ని కూడా… నియంత్రిం చేశారు. వారు పోరాటం చేయకుండా కట్టడి చేశాయి. అయితే ఇదే అదనుగా అధికారులు మాత్రం.. రాజధాని గ్రామాల్లో హల్ చల్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా.. రోజూ.. ప్రభుత్వ, సీఆర్డీఏ అధికారులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. రాజధాని పరధిలో కొత్తగా ఆర్ -5 అనే జోన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని..దీనిపై అభ్యంతరాలు చెప్పాలంటూ.. రైతుల వెంట పడతున్నారు. ఈ ఆర్-5 జోన్ ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలిచ్చిందేకు ఏర్పాటు చేస్తున్నది.

అందరూ వైరస్ భయంతో తలుపులు వేసుకుని కూర్చుంటే.. అధికారులు మాత్రం రైతుల ఇళ్లకు క్యూ కడుతున్నారు. ఆర్-5 జోన్‌పై అభిప్రాయం చెప్పాలంటూ వెంటపడుతున్నారు. అది కూడా..నేరుగా కాదు.. స్కైప్‌ లాంటి యాప్‌లు ఉపయోగించి.. ఉన్నతాధికారులకు లింక్ కలుపుతున్నారు. దాని ద్వారా అభిప్రాయాలు చెప్పాలంటున్నారు. తమకు ఇవేమీ తెలియదని రైతులు అంటున్నా.. గ్రూపు కాలింగ్ పేరుతో వేదిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓరోజు నీరుకొండలో కాగితాలతోనూ, తరువాత రోజు మందడంలో ట్యాబ్ లతోనూ హల్ చల్ చేసిన అధికారులు.. మరోసారి గ్రూప్ కాలింగ్ ల ద్వారా అందరూ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందేనని రైతులను సిఆర్డీఏ అధికారులు బలవంతపెడుతున్నారు. అధికారుల తీరును రికార్డు చేస్తున్న రైతులు.. కేంద్ర హోంశాఖకు.. హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

రాజధానిలో ఇతరులకు స్థలాలిచ్చే జీవోను 107ను హైకోర్టు నిలుపుదల చేసింది. నిజానికి ఆర్-5 జోన్ విషయంలో నిబంధనల ప్రకారం.. రైతులకు తమ అభిప్రాయాలు, సూచనలు చెప్పేందుకు ఈ నెల 24వరకూ సమయం ఉన్నా వెంట పడుతున్నారు. ఉగాదికే ఇళ్ల స్థలాలివ్వాలనుకున్న ప్రభుత్వానికి భూములు లభ్యం కాలేదు. దాంతో ఈసీ అనుమతి ఇచ్చినా కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ నెల ప ధ్నాలుగున నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పటికీ భూములు లభ్యం కాలేదు. ఎలాగైనా రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని పట్టుదలగా ప్రభుత్వం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close