గుంటూరు-విజయవాడ మధ్యలో ఉండే నంబూరు ప్రాంతంలో గత పదేళ్లుగా రియల్ ఎస్టేట్ అనూహ్యంగా పెరిగింది. దానికి కారణంగా అమరావతి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మధ్యలో ఐదు సంవత్సరాల పాటు నెమ్మదించినా ఇప్పుడు జోరుగా ఉంది. నంబూరుతో పాటు చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు, అపార్టుమెంట్లు, ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. గతంలోలా రియల్టర్లు, బిల్డర్లు అత్యాశకు పోవడం లేదు. మధ్యతరగతికి అందుబాటులోనే ధరలు ఉంటున్నాయి.
నంబూరు ఆపార్టుమెంట్లలో ఎస్ఎఫ్టీకి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకూ బిల్డర్లు అమ్ముతున్నారు. 30 లక్షల నుండి 60 లక్షల రూపాయల రేంజ్ లో అపార్టుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలో 1200 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ 45 లక్షల నుండి 55 లక్షల మధ్య అమ్ముతున్నట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు. అమరావతి రోడ్ సమీపంలో 1800 చదరపు అడుగుల 3 BHK అపార్ట్మెంట్ 70 లక్షల నుండి 90 లక్షలకు అమ్ముతున్నారు.
నంబూరు, గోరంట్ల, మంగళగిరి, అమరావతి రోడ్ సమీపంలో ఉన్న ప్రాజెక్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్థానిక బిల్డర్లు ఇండిపెండెంట్ హౌస్లు , అపార్టుమెంట్ నిర్మిస్తున్నారు. 150 గజాల స్థలంలో నిర్మించే ఇండిపెండెంట్ ఇళ్లకు దాదాపుగా కోటి పెట్టాల్సి లఉంటుంది. హైవే సమీపంలో ఉండటం, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, పాఠశాలలు, ఆసుపత్రులు దగ్గర్లోనే ఉండటం నంబూరును ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా చేస్తున్నాయి.