ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటోంది. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో ఇలాంటివి జరగలేదు. చాలాకాలం విరామం తర్వాత నరెడ్కో తిరిగి నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఈ ఫెస్టివల్ ఇళ్ల కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు , స్టేక్హోల్డర్లకు ఒక సమగ్ర ప్లాట్ఫాం అందిస్తుంది, అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, ఆన్-స్పాట్ ఫైనాన్సింగ్ , మార్కెట్ ఇన్సైట్స్ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కోసం చాలా కార్యక్రమాలు ప్రకటించింది. అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. (NALA యాక్ట్ రద్దు, నిర్మాణ నిబంధనల సరళీకరణ, భవనాలకు నిమిషాల్లోనే అనుమతులు వంటివి రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ను మెరుగుపరుస్తున్నాయి.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకూ ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రముఖ డెవలపర్లు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొవైడర్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్చర్ స్పెషలిస్టులు, మెటీరియల్ సప్లయర్లు ఇందులో పాలు పంచుకోనున్నారు. రీజియనల్ ప్రాపర్టీ మార్కెట్ అవుట్లుక్పై స్పెషల్ సెషన్లు నిర్వహిస్తారు. డెవలపర్లతో డైరెక్ట్ ఇంటరాక్షన్, ఆన్-సైట్ బుకింగ్స్ ప్రీ-అప్రూవల్స్ ఉంటాయి.
ఇలాంటి ప్రాపర్టీ ఫెస్టివల్స్ ద్వారా.. అన్ని ప్రాజెక్టుల సమాచారం ఒకే చోట లభిస్తుంది. వెంటనే కొనుగోలు చేయగలిగే ఇళ్ల గురించి తెలుస్తుంది. ఇలాంటివి రియల్ భూమ్ను పెంచుతాయి.