హైదరాబాద్‌లో “అమరావతి సింగపూర్” పెట్టుబడులు..!

అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై ఏపీ ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో.. సింగపూర్ కంపెనీలు పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయాయి. అలా వెళ్లి.. నేరుగా హైదరాబాద్‌లో దిగాయి. మంత్రి కేటీఆర్‌తో.. సింగపూర్ ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. పెట్టుబడులతో ముందుకు వచ్చిన కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఐటీ, ఫార్మా, టూరిజం వంటి రంగాల్లో పలు పెట్టుబడుల ప్రతిపాదనలను… కేటీఆర్‌కు.. సింగపూర్ ప్రతినిధులు వివరించారు. త్వరలో పూర్తి స్తాయి ప్రణాళికలను ప్రభుత్వానికి సింగపూర్ ప్రతినిధులు సమర్పించే అవకాశం ఉంది.

భారత్‌లో పెట్టుబడుల కోసం.., సింగపూర్ ప్రభుత్వం, వ్యాపార సంస్థలు.. భారీ ప్రణాళికలే వేసుకున్నాయి. వారి పెట్టుబడులను ఆకర్షించడంలో.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారు. అమరావతి విషయంలో చంద్రబాబు విజన్ నచ్చడంతో అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఉచితంగా ఇచ్చింది. ఇక స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట‌ కోసం రంగంలోకి దిగే సమయంలో… ప్రభుత్వం మారిపోయింది. అప్పటికీ సింగపూర్ ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం… అమరావతి ఓ సామాజికవర్గం వారిదేనని.. ఆ సామాజికవర్గాన్ని బలపర్చాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో.. సింగపూర్ సంస్థతో ఒప్పందాలు కట్ చేసుకుంది.

ఇప్పుడు.. వారు అమరావతిలో పెట్టుబడుల కోసం సిద్ధం చేసుకున్న సొమ్మును.. తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టబోతున్నారు. ఈ అంశంపై.. కార్యాచరణ ప్రారంభించారు. కేటీఆర్ ఇలాంటి అవకాశాలను అసలు వదిలి పెట్టరు. విదేశీ పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి సహకారం అందించి.. హైదరాబాద్‌కు మరింత విస్తృతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే.. ఏపీ ప్రభుత్వం.. వద్దనుకున్న సింగపూర్ పెట్టుబడులను.. తెలంగాణ మాత్రం రెడ్ కార్పెట్‌ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close