ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్రీన్-బ్లూ, స్మార్ట్ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ విజన్‌లో కీలక భాగం అండర్‌గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ. హై-టెన్షన్ పవర్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్, ఆప్టిక్ ఫైబర్లు అసలు పైకి కనిపించవు. మంత్రి నారా లోకేష్ ఈ వ్యవస్థలో జరుగుతున్న పనుల గురించి చేసిన ట్వీట్ వైరల్ అయింది. వరల్డ్-క్లాస్ అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రా వేగంగా రూపొందుతోందని” లోకేష్ పోస్ట్ చేశారు.
అమరావతి అండర్‌గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ 2015లోనే ప్లాన్ చేశారు. విపత్తుల వల్ల చిన్న పవర్ కట్ కూడా ఉండకుండా డిజాస్టర్ ప్రూఫ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డిజైన్ చేశారు. సిటీ స్మార్ట్ డక్ట్ ప్రాజెక్ట్ కింద 700 కి.మీ. లెంగ్త్‌లో అండర్‌గ్రౌండ్ డక్ట్లు నిర్మిస్తున్నారు. ఇవి పవర్, కమ్యూనికేషన్ కేబుల్స్, ఆప్టిక్ ఫైబర్, సిటీ గ్యాస్ లైన్లకు ఉపయోగపడతాయి. హై-టెన్షన్ అండర్‌గ్రౌండ్ కేబులింగ్ .. HT లైన్లు కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉంటాయి.
ఈ ఇన్ఫ్రా అమరావతిని మోడరన్, టెక్నాలజీ అడ్వాన్స్డ్ సిటీగా మారుస్తుంది. GIS, BESS వంటి అడ్వాన్స్డ్ టెక్‌లతో 2,000 MWh ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్లు అమలవుతాయి. అమరావతి ఇన్ ఫ్రా భవిష్యత్ లో అనేక నగరాల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాలకు ప్రత్యేకమైన మోడల్‌గా నిలుస్తుంది.
