ఆనంద్‌ దేవ‌ర‌కొండ సినిమా… అంత రేటా?

ఈమ‌ధ్య అమేజాన్ ప్రైమ్ కి దెబ్బ‌లు మీద దెబ్బ‌లు త‌గిలాయి. భారీ సినిమాలు కొని బోల్తా ప‌డింది. పెంగ్విన్‌, వి, నిశ్శ‌బ్దం.. వీటిలో ఏ ఒక్క‌టీ అమేజాన్ ప్రైమ్ కి ప్ల‌స్ పాయింట్లు కాలేక‌పోయాయి. కొన్నాళ్ల పాటు అమేజాన్ తెలుగు సినిమాల‌వైపు చూడ‌ద‌నుకున్నారంతా. అయితే… ఇప్పుడు `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` సినిమాని సొంతం చేసుకుంది.వ‌చ్చే నెల 20వ తేదీన ఈ సినిమా అమేజాన్ లో ప్ర‌ద‌ర్శితం కానుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. పేరుకి త‌గ్గ‌ట్టు మీడియం రేంజు బ‌డ్జెట్ సినిమా. త‌క్కువ రేటుకి అమేజాన్ కొనేసి ఉంటుంద‌నుకుంటున్నారంతా. నిజానికి ఈసినిమా కోసం 4.5 కోట్లు వెచ్చిందింద‌ని టాక్‌. తొలి సినిమా `దొర‌సాని` ఆడ‌క‌పోయినా రెండో సినిమాని అమేజాన్ ఇంత రేటుతో కొనేసిందంటే విశేష‌మే మ‌రి. అయితే ఈసారి అమేజాన్ ఊర‌కే ఈ సినిమా కొన‌లేదు. అమేజాన్ ప్ర‌తినిథులు ఈ సినిమా చూసి, `బాగుంది` అని స్టాంప్ వేశాకే.. అమేజాన్ ఇంత రేటు వెచ్చించింద‌ని టాక్‌. ఇది వ‌ర‌కు సొంతం చేసుకున్న మూడు సినిమాలూ కేవలం కాంబినేష‌న్‌, క్రేజ్‌చూసి సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం కాస్త ముందు జాగ్ర‌త్త వ‌హించి, శాటిలైట్ ఛాన‌ల్ లా ఆలోచించి, కొనుగోలు చేసింది. ఓటీటీలో విడుద‌ల చేస్తే సినిమా ఫ్లాపే అనే ఓ ముద్ర ప‌డిపోయింది. దాన్ని `మిడిల్ క్లాస్ మెలోడీస్` అయినా పోగొడుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close