అమరావతిపై ఐదేళ్లు విషం కక్కి ఫలితం అనుభవిస్తున్న వైసీపీకి ఇంకా తత్త్వం బోధపడినట్లుగా కనిపించడం లేదు. అమరావతి రీస్టార్ట్ అయి ఓ రూపం సంతరించుకుంటే వైసీపీకి నూకలు చెల్లుతాయనే భయమో ఏమో , అమరావతిపై పాత పాటే అందుకున్నారు. శుక్రవారం ప్రధాని మోడీ అమరావతి పునర్ నిర్మాణ పనులను గ్రాండ్ గా ప్రారంభించారు. వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజిన్ అవుతుందన్న ప్రధాని ప్రకటనతో అమరావతి నిర్మాణంపై పూర్తి నమ్మకం ఏర్పడింది.
అమరావతి సభపై జగన్ మాట్లాడినా, సజ్జల మాట్లాడినా అది మరింత ఎఫెక్ట్ అవుతుంది. ఈ సభపై ఏదో ఒక విమర్శ చేయాలని కనుక,కనీసం లాజిక్ లేకుండా మాట్లాడే అంబటి రాంబాబును పురమాయించారు. అమరావతిపై ఇప్పటికీ నోరు పారేసుకుంటే భవిష్యత్ లో ఆయనకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిసి కూడా విషం కక్కారు.
అమరావతి రాజధానిగా పనికిరాదంటూ మళ్లీ పాత పాటే పాడటమే కాకుండా మరింత విషం కక్కారు. అంబటి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యాఖ్యలను చూస్తే ఆయన ఎంత లాజిక్ లెస్ గా మాట్లాడుతారో మరోసారి స్పష్టం అయింది. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అన్నారని , అలాంటప్పుడు దాని అభివృద్ధికి 52వేల కోట్లు అప్పు చేశారని తను లాజిక్ మాట్లాడుతున్నానని భ్రమతో వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతల తీరు చూస్తుంటే రూపాయి పెట్టుబడి లేకుండా కోటీశ్వరులు కావాలనే విధంగా ఉన్నాయనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజధాని నిర్మాణం పూర్తయ్యాక అమరావతి స్వయం ఉపాధి కేంద్రంగా మారుతుంది. ఎంప్లాయ్మెంట్ హబ్ గా మారుతుంది. అందుకే ముందుగా అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాల్సి ఉంది. చంద్రబాబు అదే ప్రయత్నం చేస్తున్నారు.
అంబటి మాత్రం అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కావాలని కోరడం వైసీపీ భావదారిద్ర్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.