అంబటి రాంబాబు ఈ సారి గుంటూరులో తన డాన్సుల ప్రోగ్రాం పెట్టుకున్నారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం అక్కడే సంబరాలు చేసుకున్నారు. కానీ ఆయనను అక్కడి నుంచి గెంటేశారు. ఎవరూ లేకపోవడంతో గుంటూరు ఇంచార్జ్ గా పెట్టారు జగన్. ఏదో ఒకటి అని అక్కడే ఫిక్సయిపోయి.. తన సంక్రాంతి సంబరాలను కూడా అక్కడే చేసుకుంటున్నారు.
భారీగా ఖర్చు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు రాంబాబు. ఇప్పటికే ముందుగానే రోజాను పిలిపించి టీజర్ తరహాలో కోడి పందేలు ఆడించారు. భోగి రోజు అంటే బుధవారం ఉదయం ఆయన డాన్సులు.. సంక్రాంతి రోజు చిందులు ఉండే అవకాశం ఉంది. ప్రతి ఏడాది భోగి రోజు ఆయన వేసే డాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ సారి గుంటూరులో ప్లేస్ దొరికినందున ఆయన ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు.
అయితే ీయ సంబరాల ఖర్చు అంతా ఆయన భరించాల్సిందే. సత్తెనపల్లిలో ఉన్నప్పుడు లాటరీ టిక్కెట్లు అమ్మేవారు. వాలంటీర్లతో అమ్మించేవారు. పెద్ద ఎత్తున డబ్బులు చేసుకునేవారు. సంబరాలు చేసుకున్నందుకు తిరిగి డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా తన సొంత ఖర్చులే పెట్టుకోవాలి. అందుకే గుంటూరులోని ద్వితీయ శ్రేణి నేతల్ని .. కార్పొరేషన్ ఎన్నికల ఆశతో భాగస్వామ్యం చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
