అంబటి రాంబంాబుకు ఫుల్ టైం వైసీపీని ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం, కోర్టుకెళ్లడం అనే పనిని కేటాయించినట్లుగా ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి వారిపై కేసులు పెట్టాలని అదే పనిగా తిరుగుతున్నారు. తాజాగా కిరాక్ ఆర్పీ, సీమ రాజాలపై కేసులు పెట్టాలని ఆయన గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వీళ్లు సోషల్ మీడియాలో వైసీపీని, వైసీపీ నేతల్ని ట్రోల్ చేస్తున్నారట.
అయితే వీరు బూతులు మాట్లాడటం లేదు.వైసీపీ నేతల తీరును ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే అతి కామెంట్ల గురించి తమదైన పద్దతిలో కౌంటర్ ఇస్తున్నారు. జరుగుతున్న రాజకీయాలను సెటైరిక్ గా కౌంటర్ వేస్తున్నారు. దీనికే వారికి కోపం వస్తోంది. వారిపై కేసులు పెట్టాలని అంటున్నారు. వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూంటారు. ఇప్పటికీ అలాంటి వారు చాలా మంది ఉంటారు. కానీ అంబటి రాంబాబు మాత్రం కిరాక్ ఆర్పీ, సీమరాజాలపై కేసు పెట్టాలని అంటున్నారు.
పట్టాభిపురం పోలీసులు కేసులు పెట్టకపోతే తాను సుప్రీంకోర్టుకు అయినా వెళ్తానని అంటున్నారు ఆయన ఇటీవల లాయర్ గా మారారు. గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ, సీమరాజాలపై కూడా అలాగే కేసు పెట్టేలా న్యాయపోరాటం చేస్తానంటున్నారు.