పాకిస్తాన్ ఓ వైపు దాడి చేస్తూంటే అందరూ ఆవేశంతో రగిలిపోతున్నారు. భారత్ ఎటాక్స్ ప్రారంభించింది. ఈ సమయంలో అంబటి రాయుడు మాత్రం కంటికి కన్ను గుడ్డి తనాన్ని తెస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. అంతే చాలా మంది ఆయనపై కోపం తీర్చుకున్నారు. తాను తప్పు చేశానని ఆయన అనుకోలేదు. ఆ ట్వీట్ ను అలాగే ఉంచారు. దాంతో విమర్శించేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంబటిని దేశద్రోహ ఖాతాలో వేసేసిన వాళ్లే ఎక్కువ.
నిజానికి అంబటి రాయుడుకు ఇలా వివాదాస్పదంగా మాట్లాడటం అలవాటు. భారత్ , పాకిస్తాన్ మ్యాచ్లకు సెలబ్రిటీలు వెళ్తే ఇక్కడ కామెంటేటర్ గా ఉండి.. వారిని టీవీల్లో చూపిస్తారని వెళ్లారని చెప్పుకొచ్చాడు. ఆ మైండ్ సెట్ అంతే.. ఎప్పటికీ మారదని ఇప్పుడు నిరూపించాడు. ఐపీఎల్ లో కామెంటరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు విని చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్ ను అసహ్యించుకోవడం ప్రారంభించారు. చా చైల్డిష్గా.. ఇంకాచెప్పాలంటే కుళ్లుతో మాట్లాడినట్లుగా అంబటి రాయుడు మాటలు ఉంటాయి.
కనీస అవగాహన లేకుండా ఇలా ఎలా మాట్లాడుతారని.. కాస్త గుర్తింపు ఉన్న క్రికెటర్ గా ఉన్నప్పుడు గౌరవాన్ని పెంచుకోవాలని నెటిజన్లు సలహాలిస్తున్నారు. కానీ ఆయన మొదటి నుంచి తన పద్దతి ఇంతే.. తాను ఇంతే అన్నట్లుగా ఉన్నారు. రాజకీయాలు లేదా క్రికెట్ గురించి ఇలా మాట్లాడితే ఎవరైనా ఓ వర్గం సమర్థిస్తుందేమో కానీ ఇలా దేశం మొత్తం ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక్కరూ సమర్థించరు. తన ఇమేజ్ మసకబారిపోతుంది.