విద్యార్ధులను తిప్పి పంపేసినందుకు సారి: అమెరికన్ ఎంబసి

సాధారణంగా అమెరికా చేయకూడనివన్నీ చేసేసిన తరువాత, విమర్శలు ఎదుర్కొన్నప్పుడు సింపుల్ గా ఒక ‘సారీ’ పడేసి చేతులు దులుపుకొంటుంది. అది ఇరాక్ పై దాడి కావచ్చు లేదా భారతీయ విద్యార్ధులను వెనక్కి తిప్పి పంపినందుకు కావచ్చును ఒకే ఒక ‘సారీ’తో తన తప్పులను, పాపాలను కడిగేసుకోవాలనుకొంటుంది. కాలిఫోర్నియాలో గల విశ్వవిద్యాలయాలలో చేరడానికి అమెరికా వెళ్ళిన 14మంది భారతీయ విద్యార్ధులను, ఎఫ్.బి.ఐ. అధికారులు ఉగ్రవాదులను పట్టుకొని ప్రశ్నించినట్లు సుమారు 12గంటలపాటు నిర్బంధించి ప్రశ్నల వర్షం కురిపించి, చివరికి వారు విద్యార్ధులేనని ద్రువీకరించుకొన్న తరువాత అమెరికాలో అడుగుపెట్టడానికి వీలులేదని వెనక్కి తిప్పి పంపేయడంతో వారందరి పరిస్థితి అయోమయంగా మారింది.

ఇంకా భారత్ లో చాలా మంది విద్యార్ధులు అవే విశ్వద్యాలయాలలో చేరేందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు గుర్తించిన భారత విదేశాంగ శాఖ వారిని కొంత కాలం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని సూచించవలసి వచ్చింది. ఈ వ్యవహరంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత కానీ అమెరికా అధికారులు స్పందించలేదు.

భారతీయ విద్యార్ధులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని భారత్ లోని అమెరికన్ ఎంబసీ తెలిపింది. “భారత్-అమెరికా దేశాల మధ్య విద్యాపరంగా సబందాలు మరింత బలపడుతున్న ఈ సమయంలో ఇటువంటి సంఘటన జరిగినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈవిధంగా ఎందుకు జరిగిందో కనుగొని సమస్యని పరిష్కరిస్తామని” మీడియాకు తెలియజేసింది. అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించడం కోసం విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా ఎంతటి వ్యయప్రయాసలు భరించవలసి వస్తుందో వారికే తెలుసు. అమెరికా అధికారులు వారిని వెనక్కి తిప్పిపంపేయడంతో అమెరికా వెళ్ళడం కోసం వారు పడిన శ్రమ, ఖర్చులు అన్నీ వృధా అయిపోయినట్లే. అమెరికన్ ఎంబసీ సింపుల్ గా సారీ చెప్పి చేతులు దులిపేసుకొంది కానీ వెనక్కి తిప్పి పంపబడిన ఆ 14మంది విద్యార్ధులను ఎవరు ఆదుకొంటారో తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“బాక్సైట్” మైనింగ్‌పై ఎన్జీటీ కఠిన చర్యలు..! కానీ …

తూర్పుగోదావరి. విశాఖ మన్యం ప్రాంతాల్లో కొంత కాలంగా బాక్సైట్ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి తీసుకెళ్తున్నారని దీని కోసం రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా...

ప్రగతి భవన్ కూల్చేసి.. ఫామ్‌ హౌస్ పంచేస్తారట..!

ప్రగతి భవన్‌ను కూల్చి వేసి ఆ స్థానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే ఎలా ఉంటుంది..?. టీఆర్ఎస్ నేతలకేమో కానీ.. ఇలాంటి ఆలోచనే బీజేపీ నేతలకు ఉత్సాహం తెచ్చి పెడుతుంది. "దళిత...

బాలభారతి పాఠశాలకు 10లక్షల విరాళమిచ్చిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా రెండవ సంవత్సరం ₹10లక్షల విరాళాన్ని కర్నూలు NRI ఫౌండేషన్ అందించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ఈ...

రివ్యూ: ఇష్క్‌

రేటింగ్: 2.5 అదేంటో గానీ.... కొన్ని సినిమాల టైటిళ్ల‌కీ, ఆ క‌థ‌కూ, క్యారెక్ట‌రైజేష‌న్ల‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. క‌థొక‌టి, టైటిల్ ఒక‌టి. `ఇష్క్‌` అలాంటిదే. ఈ టైటిల్ విన‌గానే ల‌వ్ స్టోరీ అనుకుంటారంతా....

HOT NEWS

[X] Close
[X] Close