తెలకపల్లి రవి : అమిత్‌ షా టు ఆరెస్సెస్‌ – సుప్రీం కోర్టుపై కస్‌బుస్‌

సిబిఐ నుంచి ఆర్‌బిఐ వరకూ సమస్త వ్యవస్థలనూ మోడీ ప్రభుత్వం అతలాకుతలం చేస్తున్న తీరు చూస్తూనే వున్నాం. వీటికంటే ముందే సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు తొలిసారి మీడియాలో ఆగ్రహావేదనలు వెలిబుచ్చడమూ మర్చిపోయే విషయం కాదు. అయితే అది పరోక్ష దాడి అయితే ఇప్పుడు బిజెపి ఆరెస్సెస్‌లు ప్రత్యక్షంగానే సుప్రీం కోర్టుపై దాడికి దిగడం చాలా ఆందోళన కలిగించే అంశం. వారం రోజల వ్యవధిలోనే బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా, ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషిలు సుప్రీంకోర్టు తీర్పులనూ ఆదేశాలనూ సూటిగా తప్పు పట్టారు. తాము చెప్పే మత వైఖరులకు భిన్నంగా తీర్పులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. శబరిమలలో అన్ని వయస్సుల స్త్రీలను అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కాకుండా ఆరెస్సెస్‌ కూటమి అడ్డుపడింది. అయ్యప్ప క్షేత్రంలో అలజడికి కారణమైంది. అక్కడున్న పినరాయి విజయన్‌ ఎల్‌డిఎప్‌ ప్రభుత్వం సంయమనం చూపించి వుండకపోతే పరిణామాలు మరోలా వుండేవి. ఈ ఉద్రరిక్తత చల్లారకముందే అమిత్‌ షా కన్నూరులో సభలో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వరాదని వ్యాఖ్యానించారు. అంతేగాక దీనిపై విజయన్‌ ప్రభుత్వాన్ని కూలదోస్తామని కూడా బెదిరించారు. వాస్తవం ఏమంటే శబరిమలలో 1991లో కేరళ హైకోర్టు తీర్పు వచ్చే వరకూ మహిళలందరినీ అనుమతించేవారు. ఆ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లింది ఆరెస్సెస్‌ వారే. అక్కడ వచ్చిన తీర్పును మొదట స్వాగతించి తర్వాత అడ్డుకుంటున్నది వారే!

ఒక మాట ఒక బాణం అన్న మాటకు మారుపేరుగా నిలిచిపోయిన శ్రీరాముడి పేరిట అయోధ్య రాజకీయం నడిపే సంఘ పరివార్‌ లీలలు అంతటితో ఆగలేదు. అయోధ్య వివాదంపై పిటిషన్లు 2019 జనవరిలో విచారిస్తామని ఈ లోగా అంత హడావుడి లేదని కొత్త ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోరు ప్రభృతులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పడంపై ఆరెస్సెస్‌ నేత భయ్యాజీ మండిపడుతున్నారు. ఈయన కూడా అమిత్‌షాలాగానే మతపరమైన మనోభావాలు దెబ్బతీసినందుకు కోర్టును ఆక్షేపిస్తున్నారు. పైగా ఈ లోగానే ఆర్గినెన్సు లేదా చట్టం తీసుకొచ్చి అయోధ్యలో రామమందిరం కట్టేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి ఈ నాలుగేళ్లు మాట్లాడని వారు ఇప్పుడే ఎందుకిది ముందుకు తెస్తున్నారంటే ఎన్నికల కోసమని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపున శివసేన నేతలు శివమెత్తినట్టు వూగిపోతున్నారు.
గుజరాత్‌ హైకోర్టులో వ్యతిరేక జడ్డిపై వివక్ష

ఈ సమయంలోనే మరో తీవ్ర పరిణామం కూడా న్యాయవ్యవస్తను ప్రభావితం చేసింది. గుజరాత్‌ హైకోర్టు ఫ్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువారు సుభాష్‌రెడ్డి సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన స్తానంలో తర్వాతిసీనియర్‌ అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కావడం సర్వసాధారణం.కాని రెండవ స్తానంలో వున్న అకిల్‌ ఖురేషిని కాదని ఆ తర్వాతి సీనియర్‌ ఎఎస్‌ దావేకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వు వెలువడింది.దీనిపై ఆందోళనలు నిరసనల తర్వాత సుప్రీం కోర్టు తన తప్పు సవరించుకున్నట్టు ప్రకటిస్తూ ఆయనకే బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఖురేషి గతంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు ఇచ్చి వున్నారు. సోరాబుద్దిన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో అప్పటి హోంశాఖ సహాయ మంత్రి అమిత్‌ షాను జైలుకు పంపింది ఈయనే. అలాగే హైకోర్టు మాజీ న్యాయమూర్తిని గవర్నర్‌ లోకాయుక్తగా నియమించడంపైనా ఆయన నాటి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి అయిష్టుడు కావడంలో ఆశ్చర్యం ఏముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close