మోడీని ప‌టేల్ స్థాయికి ఎత్తేస్తున్న‌ అమిత్ షా!

రెండోసారి ప్ర‌ధాని మంత్రి అయ్యాక న‌రేంద్ర మోడీ కొన్ని సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్నారు, దాన్ని ఎవ్వ‌రూ కాద‌న‌రు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దుగానీ, కాశ్మీరులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు విష‌యంలోగానీ భాజ‌పా స‌ర్కారు చూపించిన చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మే. అయితే, కాశ్మీరు విష‌యంలో మోడీ చూపించిన చొర‌వ‌ను ఏకంగా స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్థాయి ప్ర‌య‌త్నంగా అభివ‌ర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైద‌రాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడెమీలో జ‌రిగిన 70వ ఐ.పి.ఎస్. బ్చాచ్ పాసింగ్ అవుట్ సెర్మ‌నీలో పాల్గొన‌డానికి అమిత్ షా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… సుర‌క్ష భార‌త్ అనే నినాదంతో మోడీ సర్కారు ప‌నిచేస్తుంద‌న్నారు.

అప్ప‌ట్లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ని ఉక్కు మ‌నిషి అన్నార‌నీ, ఇప్పుడు న‌రేంద్ర మోడీ కూడా ఉక్కు మ‌నిషే అని అమిత్ షా చెప్పారు. నిజాం పాల‌న‌లో ఉన్న హైద‌రాబాద్ తో స‌హా దాదాపు 500 సంస్థానాల‌ను విలీనం చేయ‌డంలో ప‌టేల్ కృషి మ‌రువ‌లేనిద‌నీ, అదే త‌ర‌హాలో న‌రేంద్ర మోడీ కూడా కాశ్మీరు అంశంలో చొరవ చూపించి ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేశార‌న్నారు. జ‌మ్మూకాశ్మీర్ కి విముక్తి క‌ల్పించ‌డంతో మోడీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌న్నారు. పాల‌కులు, సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగుల భుజాలపైనే దేశ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. సుర‌క్ష భార‌త్ ల‌క్ష్యాన్ని మోడీ పెట్టుకున్నార‌నీ, దాన్ని సాధించే దిశ‌గా ఐపీఎస్ లు ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై, భ‌ద్ర‌త‌పై న‌మ్మ‌కం పెంచే విధంగా విధి నిర్వ‌హ‌ణ ఉండాల‌ని చెప్పారు.

నాడు సంస్థానాల విలీనం కోసం ప‌టేల్ తీసుకున్న చొర‌వ వేరు, ఇవాళ్ల కాశ్మీర్ లో 370 ర‌ద్దుకి మోడీ తీసుకున్న చొర‌వ వేరు. వాస్త‌వానికి, రెండింటినీ ఒకే త‌ర‌హా ప్ర‌య‌త్నం అని పోల్చ‌డ‌మే స‌రైంది కాదు. రెండూ ముఖ్య‌మైన అంశాలే, విడివిడిగా దేనిక‌దే ప్ర‌త్యేక‌మైంది. కానీ మ‌రీ ప‌టేల్ ఉక్కు మ‌నిషి అన్నార‌ని… మోడీని కూడా ఉక్కు మ‌నిషి అని అమిత్ షా అభివ‌ర్ణించ‌డం కాస్త అతిగా అనిపిస్తోంది. కాశ్మీరు అంశంలో మోడీ స‌ర్కారు చొర‌వ క‌చ్చితంగా ప్ర‌శంస‌నీయ‌మే, సాహ‌సోపేత నిర్ణ‌య‌మే. అయితే, ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు కావాల్సిన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు మోడీ స‌ర్కారుకు ఇప్పుడు అనుకూలించాయి. దీన్ని సంస్థానాల విలీనానికి ప‌టేల్ చూపిన చొర‌వ‌తో స‌రిపోల్చ‌లేం క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త పాలసీ : ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి రాచబాట..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తోంది. పరిశ్రమలు పెట్టాలనుకునేవారి... అనేకానేక ప్రోత్సాహకాలతో కొత్త పాలసీ ప్రవేస పెట్టింది. భారీగా పెట్టుబడులు పెట్టే వారికి భారీ రాయితీలు ఇవ్నున్నారు. వచ్చే మూడేళ్ల...

” ఈశ్వరయ్య టేపు ” తీగ లాగితే మొద్దు శీను హత్య వరకూ వెళ్తోందేంటి..?

మొద్దు శీనును జైలు బయట హత్య చేసి ఓం ప్రకాష్ ఉన్న బ్యారక్ లోపల వేశారా..? . అవుననే అంటున్నారు.. అప్పట్లో... మొద్దు శీను హత్యకు గురైన సమయంలో న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ....

అత‌డు వ‌చ్చి.. ప‌దిహేనేళ్లు!

అత‌డు.. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ స‌త్తా చెప్పిన చిత్ర‌మ్‌. మ‌హేష్ స్టైలీష్ న‌ట‌న‌ని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంత‌లు తొక్కించిన సినిమా. ఇప్ప‌టికీ.. ఆ సినిమా గురించి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానులు...

చిరు చేప‌ల ఫ్రై.. సూప‌ర్ హిట్టు

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ మ‌రింత యాక్టీవ్ గా క‌నిపిస్తున్నారు చిరంజీవి. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రుస్తూ చిరు కొన్ని వీడియోలు చేశారు. పోలీసుల పిలుపు మేర‌కు ప్లాస్మా డొనేష‌న్ క్యాంపులో పాల్గొని.. వాళ్ల‌ని ఉత్సాహ...

HOT NEWS

[X] Close
[X] Close