పదే పదే ఆస్పత్రిలో చేరిక..! అమిత్ షాకు ఏమైంది..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అనారోగ్యం వీడటం లేదు. ఆయనకు పదే పదే శ్వాస సమస్యలు తిరగబెడుతున్నాయి. దీంతో మరోసారి ఆయన ఎయిమ్స్‌లో చేరాల్సి వచ్చింది. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో శ్వాస పీల్చడం ఇబ్బంది అనిపించడంలో ఎయిమ్స్‌లో చేరిపోయారు. నిజానికి ఆయన గత వారమే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగస్టు రెండో తేదీన అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు వారాల చికిత్స తర్వాత ఆయనకు నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.

మళ్లీ ఆగస్టు పద్దెనిమిదో తేదీన తెల్లవారుజామున ఆయన ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో శ్వాస సమస్య ఏర్పడటం.. ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అమిత్ షాకూ అవే లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ నుంచే విధులు నిర్వహించారు. దాదాపుగా రెండు వారాల పాటు.. వైద్యల పర్యవేక్షణలో ఉన్న ఆయన పూర్తిగా కోలుకోవడంతో గత వారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. మళ్లీ సమస్య తిరగబెట్టడంతో ఎయిమ్స్‌లో జాయినయ్యారు.

కరోనా వైరస్ ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికిత్స తర్వాత వైరస్‌ను శరీరం నుంచి బయటకు పంపేసినా… ఆ ప్రభావం మాత్రం కొనసాగుతోందని అంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం అమిత్ షా.. ముందస్తు జాగ్రత్తలు.. పర్యవేక్షణ కోసమే… ఆస్పత్రిలో చేరారని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close